డాలర్ శేషాద్రికి మరోసారి గుండెపోటు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం తొలుత స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం డాలర్ శేషాద్రిని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.
తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయన అలసట కారణంగా అస్వస్థతకు లోనయినట్లు సమాచారం. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చింది. కాగా డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వివరాలు తెలియాల్సి ఉంది.