డాలర్ శేషాద్రి పదవీ కాలం పెంపు
తిరుపతి : డాలర్ శేషాద్రి మరోసారి చక్రం తిప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో డాలర్ శేషాద్రి పదవీ కాలంని మరో రెండేళ్లు పొడిగించారు. గత ఎనిమిదేళ్లుగా ఆయన కాంట్రాక్ట్ పద్దతిలోనే ఆలయ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా కొనసాగుతున్నారు. పదవీ విరమణ చేసినా ఆలయ ఓఎస్డీగా శేషాద్రిని కొనసాగించటంపై మరోవైపు విమర్శులు వినిపిస్తున్నాయి. ఆయన ఆ పదవి నుంచి తొలగితే ....ఆ పదవికి అర్హులైనవారు చాలామంది ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డ డాలర్ శేషాద్రి శ్రీవారి బంగారు డాలర్లు మాయం అయిన సంఘటనలో ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ప్రముఖుల అండదండలతో వాటి నుండి ఆయన క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. ఇంతకు ముందే ఓ సారి తన పదవీకాలం పొడిగించుకున్న డాలర్ శేషాద్రి ఈ సారి కూడా తన పదవి పోకుండా చక్రం తిప్పాడు.