osd
-
ఫైల్స్ చోరీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన తలసాని ఓఎస్డీ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అయితే, మూడు రోజుల క్రితం.. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ అయిన ఉదంతంలో కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయం నుంచి పలు కీలక పైళ్లను తీసుకెళ్లారని, మిగతా ఫైళ్లను చిందరవందరగా పడేశారని పేరొన్నారు. ఆఫీస్‌లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్న వాచ్‌మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కల్యాణ్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. -
మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ!
సాక్షి, హైదరాబాద్, నాంపల్లి (హైదరాబాద్): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌పై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం... మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోనూ... హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అధికారిక ద్రస్తాలు ఎత్తుకెళ్లినట్టు ప్రచా రం జరుగుతోంది. ఇక్కడే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మాజీ మంత్రి కార్యాలయం నుంచి ఒక ఆటోలో కొంతమంది ఫైళ్లు తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని అబిడ్స్ పోలీసులు తెలిపారు. కార్యాలయం వాచ్మెన్ వెల్లడించిన ప్రకారం కొన్ని బస్తాల్లో కాగితాలు, ఫైళ్లు తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో ఏమున్నాయనేది విచారణ జరిపితే తెలుస్తుందని, అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. వాస్తవానికి రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. గేట్ కూడా మూసివేస్తారు. కానీ ఆగంతకులు లోనికెలా వచ్చారు? తాళం ఎలా తీశారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన సెలవు రోజున... అదీ రాత్రి సమయంలో జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తీసుకెళ్లారని భావిస్తున్న ద్రస్తాలు ఏ శాఖకు సంబంధించినవి? వాటి ప్రాధాన్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. ఎస్సీఈఆర్టీ కార్యాలయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదీనంలో ఉంటుంది. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్, శామీర్‌పేట: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హరికృష్ణ స్థానంలో ఇన్చార్జ్ ఓఎస్డీగా సుధాకర్ రావును నియమించారు. లైంగిక వేధింపుల ఆరో పణలపై నివేదిక సమర్పించాలని ఐదుగురు సభ్యు లతో కూడిన కమిటీని మంత్రి ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ (స్పోర్ట్స్) శైలజా రామయ్యర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) వైస్‌చైర్మన్, ఎండీ, క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమిటీ సభ్యు లు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పోర్ట్స్ స్కూల్లోని బాలికలు, సిబ్బందిని వేర్వేరు గా విచారించారు. పాఠశాలతోపాటు బాలికల హాస్టల్లోని సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారు. విచారణ ముగిశాక ఈ కమిటీ నివేదికను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు అందించనుంది. కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. కాగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ట్వీట్ చేశారు. ఓఎస్డీని వెళ్లొద్దంటూ కారుకు అడ్డుగా నిలిచిన బాలికలు సస్పెండ్ అయిన హరికృష్ణను స్పోర్ట్స్ స్కూల్ నుంచి వెళ్లొద్దంటూ కొందరు బాలికలు కారుకు అడ్డుగా నిలిచారు. మీరు లేకుంటే స్కూల్ అభివృద్ధి జరగదని, మీరు ఎలాంటి తప్పు చేయలేదని క్యాంపస్‌లోనే ఉండాలంటూ వారు భావోద్వేగానికి లోనయ్యారు. -
సర్వీసు అధికారులు వెయిటింగ్లో.. రిటైర్డ్ అధికారులు పోస్టింగ్‌లో..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ రంగమైనా ఉద్యోగానికి ఒక రిటైర్మెంట్ వయసు ఉంటుంది. కీలక విభాగాల్లో, ఉన్నతమైన స్థానాల్లో పనిచేసే అధికారుల పదవీ విరమణ వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందనుకుంటే సలహాదారుడి గానో లేదా ఓఎస్డీగానో కొద్ది రోజులు నియమించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. కానీ పోలీస్ శాఖలో మాత్రం రిటైరై ఎన్నేళ్లయినా ఫర్వాలేదు.. ఓఎస్డీ, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ లాంటి పేర్లతో కీలక విభాగాలకు బాస్‌లుగా చలామణి అవ్వొచ్చు. రాష్ట్రం ఏర్పడకముందు ఇద్దరు, ముగ్గురు అధికారులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఏళ్లపాటు ఓఎస్డీలుగా పెత్తనం చెలాయించారు. తీరా తెలంగాణ ఏర్పడిన తర్వాత రిటైరైన అధికారులు పదవిలో కొనసాగుతున్న అధికారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా పోలీస్ శాఖలోని కీలక విభాగాలతోపాటు డిప్యుటేషన్ యూనిట్లలోనూ ఇదే రకమైన ఓఎస్డీల పెత్తనం పెరిగిపోయింది. అత్యంత కీలక విభాగంలో... రాష్ట్ర పోలీస్ శాఖకే కాదు, ప్రభుత్వానికీ ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకం. ప్రతీక్షణం శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు.. ఇలా ప్రతీ అంశాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టి ప్రభుత్వానికి నివేదించాలి. ఇలాంటి విభాగంలోని కీలకమైన ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) మొత్తం పదవీ విరమణ పొందిన అధికారుల పెత్తనంలోనే నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ పేరుతో రిటైర్డ్ ఐజీ, ఓఎస్డీల పేరుతో మరో ముగ్గురు నాన్‌కేడర్ అదనపు ఎస్పీలు ఎస్ఐబీని నడిపిస్తున్నారనే చర్చ పోలీస్ శాఖలో జరుగుతోంది. మరోవైపు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ (సీఐసెల్) విభాగంలో రిటైరైన ఇద్దరు అదనపు ఎస్పీలు, ట్రాన్స్‌కోలో ఓ రిటైర్డ్ అదనపు ఎస్పీ, పోలీస్ అకాడమీలో ఒక రిటైర్డ్ ఎస్పీ, ఏసీబీలో రిటైరైన ఓ ఐఈపెస్ అధికారి ఏళ్ల నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పేరుతో కొలువులో ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే నగర కమిషనరేట్‌కు అత్యంత కీలకమైన టాస్క్‌ఫోర్స్ విభాగానికి డీసీపీగా నేతృత్వం వహిస్తున్న అధికారి సైతం ఏళ్ల నుంచి ఓఎస్డీగా పనిచేస్తుండటం గమనార్హం. ఇలా మొత్తం పోలీస్ శాఖలో 23 మంది పదవీ విరమణ పొందిన అధికారులు ఓఎస్డీ పేరుతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వెయిటింగ్లో 43 మంది అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్న సామెత రాష్ట్ర పోలీస్ శాఖకు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు 43 మంది ఐపీఎస్ అధికారులు పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. వీరిని వివిధ విభాగాలకు అటాచ్మెంట్ల పేరుతో అంతర్గత ఆదేశాలు ఇచ్చి కూర్చోబెట్టారు. కానీ కీలక విభాగాల్లో ఐపీఎస్‌లు చేయాల్సిన విధులను రిటైరైన అధికారులకు ఇచ్చి కూర్చోబెట్టడం వివాదాస్పదమవుతోంది. రిటైరై ఓఎస్డీగా ఉన్న అధికారులు ఎక్కడ కూడా అధికారికంగా సంతకాలు గానీ, ప్రతిపాదనలపై పెత్తనం గానీ చేయకూడదు. కానీ వీరు ఏకంగా అధికారిక ఉత్తర్వులపై సంత కాలు చేస్తూ వివాదానికి తెరలేపుతున్నారు. సర్వీస్‌లో ఉన్న ఐపీఎస్, నాన్‌కేడర్ అధికారులను కాదని రిటైరైన అధికారులకు పెత్తనం ఇవ్వడం వెనకున్న ఆంతర్యమేంటనే చర్చ జరుగుతోంది. -
West Bengal: అంకుల్ జీ అంటూ గవర్నర్‌పై ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గవర్నర్ జగ్దీప్ ధన్కర్, తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆదివారం నుంచీ ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు ట్వీట్ల ద్వారా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ముఖ్యంగా గవర్నర్‌ను అంకుల్ జీ అని సంబోధిస్తూ.. మహువా ట్వీట్లు చేస్తుండటం గమనార్హం. ఇక తాజాగా తన ‘‘కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్తులను రాజ్‌భవన్‌లో ఓఎస్డీలుగా నియమించారు’’ అంటూ మహువా మోయిత్రా చేసిన ఆరోపణలను గవర్నర్ జగదీప్ ధన్కర్ సోమవారం తోసిపుచ్చారు. రాష్ట్రంలో "భయంకరమైన శాంతిభద్రతల పరిస్థితి" నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై జగదీప్ ధన్కర్ ‘‘ఓఎస్డీలుగా నియమించిన ఆరుగురు వ్యక్తులు నా కుటుంబ సభ్యులు అంటూ మీడియాలో ప్రచారం చేయడం నిజంగా తప్పు. వారు నాకు బంధువులు అనే మాట పూర్తిగా అవాస్తవం. ఈ ఓఎస్డీలు మూడు రాష్ట్రాలకు, నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వారు. వీరిలో ఎవరూ మా కుటుంబంలో భాగం కాదు. వీరిలో కనీసం ఒక్కరు కూడా నా సొంత రాష్ట్రానికి, కులానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరు’’ అంటూ ట్వీట్ చేశారు. Assertion @MahuaMoitra in tweet & Media that six coterminous appointee OSDs in personal staff are relatives is FACTUALLY WRONG. OSDs are from three states and belong to four different castes. None of them is part of close family. Four of them are not from my caste or state. — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) June 7, 2021 దీనిపై మహువా వెంటనే స్పందించారు. వాళ్ల చరిత్ర ఏంటో, వారిలో ఎవరు.. ఎలా రాజ్‌భవన్‌లోకి వచ్చారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. బీజేపీ ఐటీ సెల్ వాళ్లు కూడా ఈ విషయంలో మీకు ఏ సాయం చేయలేరని మోయిత్రా ఎద్దేవా చేశారు. అంతేకాదు మీకు ఉపరాష్ట్రపతి పదవి కూడా దక్కుతుందని అనుకోవడం లేదంటూ ట్వీట్ చేశారు. చదవండి: బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి... తీవ్ర ఆందోళనకరం -
కేంద్రమంత్రిని వెంటాడుతున్న కరోనా భయం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. ఏ వర్గాన్నీ వదలకుండా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు వైద్యులు, పోలీసు అధికారులు వైరస్‌బారిన పడగా... తాజాగా కేంద్రమంత్రిని సైతం కరోనా భయం వెంటాడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్ ఓఎస్డీ (ఆఫీస్ ఆఫ్ స్పెషన్ డ్యూటీ) సెక్యూరిటీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వ్యక్తిగత సిబ్బందిలో ఒక్కసారిగా వైరస్ కలకలం రేపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రమంత్రి ఓఎస్డీ వద్ద ఆఫీస్ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మంత్రి కార్యాలయ సిబ్బంది అతన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించింది. ఈ క్రమంలోనే వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి హర్షవర్థన్ ఓఎస్డీతో సహా, అతని కుటుంబం, సమీపంగా మెలిగిన వ్యక్తులను అధికారులు స్వీయ నిర్బంధం పాటించాలని ఆదేశించారు. మరోవైపు వీరిలో ఎవరైనా హర్షవర్థన్‌ను ప్రత్యక్షంగా కలిశారా అని అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిలో ఏమాత్రం అనుమానం ఉన్నా.. ముందు జాగ్రత్తగా కేంద్రమంత్రికి సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 2625 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 54 మంది మ్యత్యువాత పడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులను మరింత అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. -
మనీష్ సిసోడియా ఓఎస్డీ అరెస్ట్
న్యూఢిల్లీ: మరి కొన్ని గంటల వ్యవధిలో దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) అధికారి గోపాల్ కృష్ణ మాధవ్ అరెస్ట్ అయ్యారు. ఆయనను గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్ట్ చేశారు. జీఎస్టీకి సంబంధించిన వ్యవహారంలో రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం మాధవ్‌ను అధికారులు సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎటువంటి సంబంధం లేనట్టుగా తెలుస్తోంది. ఈ కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అండమాన్ నికోబార్ దీవుల కేడర్ సివిల్ సర్వీసెస్ అఫిసర్ గోపాల్ కృష్ణ.. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వద్ద 2015లో ఓఎస్డీగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓఎస్డీ అరెస్ట్ కావడం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయ అంశంగా మారింది. -
ప్రొటోకాల్ ఓఎస్డీగా పీవీ సింధు
సాక్షి, అమరావతి: డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్డీగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రొటోకాల్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పీవీ సింధుకు 2018 డిసెంబర్ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సింధును డిప్యూటీ కలెక్టర్‌గా గత ప్రభుత్వం నియమించింది. -
వైదొలిగిన ‘ప్రిన్సిపాల్ సెక్రటరీ’ మిశ్రా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. అయితే రెండు వారాలు ఆ పదవిలో కొనసాగాల్సిందిగా మోదీ ఆయనను కోరినట్లు ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. పదవీ విరమణ పొందనున్న మిశ్రాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను పీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన కొత్తలో మిశ్రా చాలా సహాకారం అందించారని, దేశాభివృద్ధికి ఎంతో సేవ చేసిన ఆయనకు విరమణానంతరం అంతా మంచే జరగాలి’ అని ఆకాంక్షించారు. ప్రధానిగా మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన ప్రభుత్వంలో పనిచేయ డం గర్వంగా భావిస్తు న్నానని మిశ్రా తెలిపా రు. 1967 బ్యాచ్ ఐఏ ఎస్ అధికారి అయిన మిశ్రా వివిధ బాధ్యతల అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. 2014లో పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ అయ్యారు. కేబినెట్ సెక్రటరీగా పదోన్నతి పొందిన పీకే సిన్హాకు పీఎంవోలో ఓఎస్డీగా ప్రభుత్వం బాధ్యతలు కల్పించింది. -
ముగ్గురు ఎన్డీ దళసభ్యుల అరెస్ట్
పాల్వంచరూరల్: సీపీఐ (ఎంఎంల్) న్యూడెమోక్రసీ రామన్న దళానికి చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ ఉత్తమకుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పాల్వంచ మండలం ఉల్వనూరు అటవీ ప్రాంతంలో రాళ్లవాగు పరిసర ప్రాంతాల్లో దళం సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీఐ రఘవేంద్రరావు, ఎస్ఐ ఎం.రమేష్ సిబ్బంది శనివారం గాలింపు చేపట్టగా అనుమానాస్పద స్థితిలో తారసపడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎన్డీకి చెందిన రామన్న దళంలో సభ్యులుగా ఉన్న బూర్గంపాడు మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన కోవాసి బుద్రు అలియాస్ సురేష్, అశ్వాపురం మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన మడివి ఉంగి, ఎలియాస్ కవిత, రోజా, భవాని, పాల్వంచ మండలం రెడ్డిగూడేనికి చెందిన వీరమల్ల సురేష్‌ను అరెస్టు చేసి వారి వద్ద రైఫిల్, ఫిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గత ఏడాది నర్సంపేటలో జరిగిన రాయల భాస్కర్ హత్యకేసులో, 2017లో బోడు ప్రాంతంలో పోలీసులకు ఎన్డీ దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఈ ముగ్గురూ ఉన్నారని తెలిపారు. సమావేశంలో పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసరావు, మణుగూరు డీఎస్పీ సాయిబాబా, సీఐ రాఘవేంద్రరావు, అశ్వారావుపేట సీఐ అబ్బయ్య, ఎస్ఐ ఎం.రమేష్ పాల్గొన్నారు. -
జేసీ అనుచరుల ఆగడాలను అరికట్టండి
-
శాంతిభద్రతలు అదుపు తప్పాయి
తాడిపత్రి:తాడిపత్రిలో శాంతిభద్రతలను కాపాడాలని ఓఎస్డీ ఐశ్వర్య రస్తోగిని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. జేసీ అనుచరుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో ఓఎస్డీని వైయస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషా, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పైలా నర్సింహయ్యలు కలిశారు. మంగళవారం రాత్రి మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషాపై జరిగిన హత్యాయత్నం గురించి ఓ ఎస్డీకి వివరించారు. కొనసాగుతున్న హత్యారాజకీయాలు తాడిపత్రిలో కొన్నేళ్లుగా హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి – జేసీ ప్రభాకర్‌రెడ్డి సోదరులు ఎవరినైనా తమ దారికి తెచ్చుకోవడానికి అనుచరుల చేత దాడులు, బెదిరింపులకు చేయిస్తుంటారని తెలిపారు. ఈ ప్రాంతంలో రోజురోజుకూ శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గయాజ్‌బాషాపై కూడా జేసీ సోదరులు పథకం ప్రకారమే అనుచరులతో హత్యాయత్నం చేయించారని వివరించారు. తన ప్రాణాలకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిల నుంచి ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని గయాజ్‌బాషా ఓఎస్డీ ఐశ్వర్య రస్తోగికి వినతిపత్రం అందజేశారు. వీరి వెంట నాయకులు నరసింహారెడ్డి, వెంకట్రామిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఓబుళరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, పట్టణాధ్యక్షుడు మనోజ్, తిమ్మేపల్లి నాగార్జునరెడ్డి, నిట్టూరు రామాంజులరెడ్డి, ఓబుళరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, బాణా నాగేశ్వరరెడ్డి, శిలార్వలి, పెయింటర్ బాషా, తదితర నాయకులు ఉన్నారు. ఎవరినీ ఉపేక్షించం : ఓఎస్డీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని ఓఎస్డీ ఐశ్వర్య రస్తోగి వైఎస్సార్సీపీ నేతలకు హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే తాడిపత్రి ప్రాంతంలోని పరిస్థితులను ఆకళింపు చేసుకుంటున్నామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. -
వేసవి శిక్షణను పకడ్బందీగా నిర్వహించండి
వేసవి శిక్షకులకు శాప్ ఓఎస్డీ రామకృష్ణ సూచన అనంతపురం సప్తగిరి సర్కిల్ : వేసవి శిక్షణ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని శాప్ ఓఎస్డీ రామకృష్ణ శిక్షకులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా ప్రాదికార సంస్థ కార్యాలయంలో వేసవి శిక్షకులకు శిక్షణ సామగ్రి కొనుగోలుకు చెక్కులను అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 శిక్షణ కేంద్రాలకు రూ.7వేలు చొప్పున 3.50లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శాప్ ఓఎస్డీ రామకృష్ణ మాట్లాడుతూ శిక్షణ సామగ్రి కొనుగోలు చేసి వాటి రసీదులను కార్యాలయంలో అందించాలన్నారు. ఆయా కేంద్రాలు ఉదయం 5.30 నుంచి 7.30 వరకు...అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 వరకు నిర్వహించాలన్నారు. ఆయా కేంద్రాల్లో 30 మంది క్రీడాకారులు లేకపోతే అలాంటి కేంద్రాలను రద్దు చేస్తామన్నారు. కేంద్రాలను నడిపేందుకు అలసత్వం ప్రదర్శించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ బాషామోహిద్దీన్, తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురుస్వామి, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, కొండారెడ్డి, సిరాజుద్దీన్, జీవన్‌కుమార్, మనోహర్‌రెడ్డి, జబీవుల్లా, ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త మండలాలకు ఓఎస్డీ పోస్టులు లేనట్లే!
♦ పాత ఎంపీడీవోలకే అభివృద్ధి బాధ్యతలు ♦ జెడ్పీ సీఈవోలను ఆదేశిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: కొత్త మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పోస్టులు సృష్టించే ప్రతిపాదనకు ప్రభుత్వం మంగళం పాడింది. ఆయా మండలాల్లోని గ్రామాలు ప్రస్తుతం ఏ మండల పరిధిలో ఉన్నాయో ఆ మండల పరిషత్ అభివృద్ధి అధికారి నేతృత్వంలోనే పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. వివిధ మండలాల పరిధిలోని గ్రామాలతో కొత్త మండలాలు ఏర్పాటు చేసినందున, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ అధికారిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా అభివృద్ధి పనుల బాధ్యతలు అప్పగించాలని సర్కారు భావించింది. ఈ మేరకు కొత్తగా ఏర్పడిన 125 మండలాలకు ఓఎస్డీల నియామకం జరగాల్సి ఉంది. అయితే.. రాజ్యంగంలోని ఆర్టికల్ 243 (ఇ) ప్రకారం ప్రస్తుత మండల, జిల్లా పరిషత్ వ్యవస్థలను మార్చేందుకు వీలుకానందున ఆయా వ్యవస్థలను వాటి పదవీకాలం పూర్తయ్యే వరకు అలాగే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మండలాల్లోని గ్రామాల్లో వాటి పూర్వ మండల పరిషత్తుల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కొత్త మండలాల్లోని గ్రామాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను పాత మండలాల ఎంపీడీవోల ద్వారానే నిర్వహించాలని, ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లా పరిషత్‌ల ముఖ్య కార్య నిర్వహణాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. -
జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి
శాప్ ఓఎస్డీ రామకృష్ణ గుంటూరు స్పోర్ట్స్: స్థానికంగా ఉన్న సదుపాయాలను వినియోగించుకుని జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని స్పోర్ట్స్ ఆ«థారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓఎస్డీ పీ రామకృష్ణ సూచించారు. ఎన్టీఆర్ స్టేడియం, ఓలేటి శరత్ (లండన్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఓలేటి విజయలక్ష్మి ఓపెన్ మెమోరియల్ పురుషుల డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. 35 ప్లెస్ డబుల్స్ విభాగంలో డాక్టర్ అన్వర్, డాక్టర్ జాకీర్‌ల జంట విజేతలుగా, ఎన్.అప్పారావు, పి.కిరణ్ జంట రన్నరప్‌గా నిలిచారు. 50 ప్లెస్ విభాగంలో బి.సత్యనారాయణ, సారథిల జంట ప్రథమ, ఎం.విజయ్ కుమార్, సురేష్‌ల జంట ద్వితీయ స్థానాలు సాధించారు. సోమవారం స్థానిక బందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన శాప్ ఓఎస్డీ రామకృష్ణ విజేతలకు ట్రోఫీలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్ల ద్వారా క్రీడాకారుల్లో ప్రతిభ వెలికి వస్తుందన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఓలేటి శరత్ మాట్లాడుతూ టెన్నిస్ అభివృద్ధి కోసం తన తల్లి పేరున టోర్నమెంట్ నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఏస్పీ సత్యనారాయణ, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి చారి, టీ.వీ.రావు, దిషా ల్యాబ్ అధినేత డాక్టర్ లతీఫ్, ఘంటా నారాయణ, ఘంటా నాగమణి, శివరామకృష్ణ, సూర్యనారాయణరెడ్డి, రమణ, టెన్నిస్ కోచ్ జి.వి.ఎస్ ప్రసాద్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
తప్పు జరిగితే బాధ్యత వహిస్తా!
కాల్స్‌పై దర్యాప్తు చేసుకోవచ్చు.. వృత్తిపరంగానే భండారీని కలిశా: అశోక్ గజపతిరాజు సాక్షి, న్యూఢిల్లీ: ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో తన ఓఎస్డీకి సంబంధాలున్నాయంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు స్పందించారు. ఓఎస్డీ అప్పారావు తప్పుచేసినట్లు తను భావించటం లేదన్నారు. అయినా ఈ విషయంలో నిజం తెలుసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని.. వారు తప్పుచేస్తే ఆ బాధ్యత కూడా తనదేనని గురువారం ఢిల్లీలో చెప్పారు. ‘మీ (మీడియా) ఆరోపణలను నేను సమీక్షిస్తాను. నా వ్యక్తిగత సిబ్బంది తప్పుచేస్తే.. అది నా వ్యక్తిగత బాధ్యతగా భావిస్తాను’ అని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. 400 ఫోన్ కాల్స్ రావటంపై విచారణ జరుపుతామని.. ఈ విషయంలో ఎవరినీ అపార్థం చేసుకోనన్నారు. అప్పారావుపై నమ్మకం ఉంది కాబట్టే ఓఎస్డీగా నియమించుకున్నానన్నా రు. తనను భండారీ కలిశారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘ఏరోస్పేస్ రంగం లో ఉన్నవారంతా కలుస్తూనే ఉంటారు. బెంగుళూరు ఎయిర్‌షోలో భండారీ ఆహ్వానం మేరకు అతడి స్టాల్‌ను సందర్శించా. ప్రత్యేక రాడార్ కనిపెట్టారని విని వెళ్లాను’ అని తెలిపారు. భండారీపై నల్లధనం కేసు: భండారీపై నల్లధన చట్టం కింద కేసుపెట్టాలని ఐటీ శాఖ భావి స్తోంది. పన్ను ఎగవేత, విదేశాల్లో అక్రమ ఆస్తు ల అంశాలను ఈ కేసులో పేర్కొననున్నారు. -
చంద్రబాబు ఓఎస్డీగా తేలప్రోలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓఎస్డీ (మీడియా ఎఫైర్స్)గా పాత్రికేయుడు తేలప్రోలు శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తేలప్రోలు శ్రీనివాసరావు స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వైరా పట్టణం. ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా శ్రీనివాసరావు విధులు నిర్వహించనున్నారు. చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పేరుతో పాదయాత్ర నిర్వహించినపుడు ఆయనతో పాటు తేలప్రోలు శ్రీనివాసరావు కూడా నడిచారు. చంద్రబాబు పాదయాత్రపై ఆయన రెండు పుస్తకాలు రచించారు. ప్రభుత్వ పథకాలు, విధానాలు, కార్యక్రమాలు సమర్ధవంతంగా ప్రచారం చేసేందుకు శ్రీనివాసరావు సేవలు చంద్రబాబు ఉపయోగించుకోనున్నారు. -
నీతి ఆయోగ్‌కు కన్సల్టెంట్లు కావలెను!
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ నిపుణుల కొరతతో సతమతమవుతోంది. దీంతో ఏడుగురు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి నెలకు రూ.1.55 లక్షల వేతనాన్ని ఇవ్వనున్నట్లు సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది. ఆర్థిక, సామాజిక, ఐటీ, రవాణా, న్యాయ, ఇంజనీరింగ్ విభాగాల్లో కన్సల్టెంట్లు అవసరమని అందులో పేర్కొంది. ప్రత్యేక కార్యకలాపాల కోసం పనిచేసే వీరిని తొలుత ఏడాది కాలపరిమితితో నియమించనున్నట్లు తెలిపింది. ఆయారంగాల్లో సరైన నిపుణులు లభించకపోవడంతో సంస్థ కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందని సీనియర్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. దీంతో ఇందులో ఉన్న సభ్యులపై పనిభారం పెరుగుతోందని, సంస్థ వైస్‌చైర్మన్ అరవింద్ పనగరియా 10 డివిజన్లు, 20 మంత్రిత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నారని; సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ 3 డివిజన్లు, 18 మంత్రిత్వ శాఖలు, 15 రాష్ట్రాలు చూస్తున్నారన్నారు. మరో సభ్యుడు వీకే సారస్వత్ 15 మంత్రిత్వ శాఖలు, 17 రాష్ట్రాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. -
ఓఎస్డీయా మజాకా!
‘మంత్రుల వద్ద నా హవా ఎంటో చూస్తారా..!’-అంటూ ఆ అధికారి తన మిత్రబృందంతో జరిపే విందుల్లో చెప్పి మరీ డాబు ప్రదర్శిస్తున్నారు. ఏపీ సీఎం కార్యాలయంలోని ప్రత్యేకాధికారి(ఓఎస్డీ) ఒకరు ఈ మధ్య రాత్రిపూట సమయం సందర్భం లేకుండా మంత్రులకు ఫోన్లు చేసి సతాయిస్తున్న వైనం ఇప్పుడు మంత్రుల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడని, అందులోనూ ఆయన కుమారుడికి మరింత సన్నిహితుడిగా పేరు పడిన ఆ అధికారి ఇటీవలి కాలంలో తన మొబైల్లో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మిత్రుల ముందు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదట! రాత్రిపూట తన మిత్ర బృందంతో విందు సమావేశాల్లో పాల్గొనే సమయంలో తన సెల్‌ఫోన్ నుంచి తనకు తోచిన ఎవరో ఒక మంత్రికి ఫోన్ చే స్తున్నారట. అలా ఫోన్‌చేసి తనకు కావాల్సిన వివరాలు.. లేదా చేయాల్సిన పనుల గురించి చెబుతున్నారు. మిత్ర బృందం ముందు దర్పం ప్రదర్శించుకునేందుకు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మరీ మాట్లాడుతున్నారట. అవత లి నుంచి ఈ ఓఎస్డీ గారు ఫోన్ చేసిన మంత్రి.. నమస్కారం పెట్టగానే ఈయన కూడా నమస్కారం పెట్టి ఫలానా విషయం ఏమైంది అని ఒక్క మాట అలా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడి ఇలా ఫోన్ కట్టేస్తున్నారట. ఫోన్ చేసింది సీఎం కార్యాలయ ఓఎస్డీ కావడంతో అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ఫోన్లు ఎత్తి మంత్రులు సమాధానం ఇస్తున్నారట. ఫోన్ చేసిన ఓఎస్డీగారేమో తన హవా ఎలా నడుస్తుందో, మంత్రులు తన ఫోన్ అంటే ఎలా అర్ధరాత్రి పూట కూడా అటెన్షన్లో నిలబడి సమాధానం ఇస్తారో మిత్రులకు సవివరంగా చెబుతూ దర్పం ఒలకబోస్తున్నారట. ఈ విషయం మంత్రులకు తెలిసినా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట! -
మహిళా మావోయిస్టు లొంగుబాటు
వరంగల్ క్రైం : సీపీఐ మావోయిస్టు అజ్ఞాత మహిళా నక్సలైట్, జనతనా సర్కార్‌లో వ్యవసాయ కమిటీ ఇన్చార్జి మచ్చ సుగుణ అలియాస్ అరుణ అలియాస్ శాంత శని వారం వరంగల్ ఓఎస్డీ సన్‌ప్రీత్‌సింగ్ ఎదుట లొంగిపోయూరు. ఈ మేరకు హన్మకొండలోని హెడ్‌క్వార్టర్స్‌లో శని వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి మండలం పంబాపూర్‌కు చెందిన మచ్చ సుగుణకు 40 ఏళ్ల క్రితం మచ్చ సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీశ్‌తో వివాహమైంది. వివాహానంతరం వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్ద రు కుమారులు జన్మించాక మచ్చ సోమయ్య మావోయిస్టు పార్టీ సాహిత్యానికి ఆకర్షితుడై ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా చేరాడు. మచ్చ సుగుణ తన కుమార్తెలు, కుమారుల వివాహానంతరం తన భర్త ఆదేశాల మేరకు పార్టీలో చేరింది. మచ్చ సోమయ్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీలో డీసీఎస్‌గా పనిచేస్తున్నాడు. మొదట పార్టీ ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భాట్టూమ్ ఏరియా కమిటీలో పనిచేసింది. తర్వాత జనతనా సర్కార్ (ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అనుబంధ సంస్థ)లో కృషి అను వ్యవసాయ కమిటీలో ఏసీఎం స్థాయి లో పామెడ, కుంట, ఎర్రారం ఏరియాలో పనిచేసింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలు, పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతోపాటు ఆరోగ్య సమస్యలు, తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయిన నక్సలైట్లకు అందిస్తున్న ప్రోత్సాహానికి ఆకర్షితురాలై పోరుబాట వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకుని స్వచ్ఛందంగా లొంగిపోయింది. లొంగిపోయిన మచ్చ సుగుణపై రూ.లక్ష రివార్డు ఉంది. మచ్చ సోమయ్య లొంగిపోవాలి.. ఛత్తీస్‌గఢ్ డీసీఎస్‌గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మచ్చ సోమయ్య ఎక్కడ ఉన్నా, వెంటనే లొంగిపోవాలని సుగుణ ఈ సందర్భంగా తన భర్తను కోరింది. -
డాలర్ శేషాద్రి పదవీ కాలం పెంపు
తిరుపతి : డాలర్ శేషాద్రి మరోసారి చక్రం తిప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో డాలర్ శేషాద్రి పదవీ కాలంని మరో రెండేళ్లు పొడిగించారు. గత ఎనిమిదేళ్లుగా ఆయన కాంట్రాక్ట్ పద్దతిలోనే ఆలయ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కొనసాగుతున్నారు. పదవీ విరమణ చేసినా ఆలయ ఓఎస్డీగా శేషాద్రిని కొనసాగించటంపై మరోవైపు విమర్శులు వినిపిస్తున్నాయి. ఆయన ఆ పదవి నుంచి తొలగితే ....ఆ పదవికి అర్హులైనవారు చాలామంది ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డ డాలర్ శేషాద్రి శ్రీవారి బంగారు డాలర్లు మాయం అయిన సంఘటనలో ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ప్రముఖుల అండదండలతో వాటి నుండి ఆయన క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. ఇంతకు ముందే ఓ సారి తన పదవీకాలం పొడిగించుకున్న డాలర్ శేషాద్రి ఈ సారి కూడా తన పదవి పోకుండా చక్రం తిప్పాడు.