సాక్షి, హైదరాబాద్, శామీర్‌పేట: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హరికృష్ణ స్థానంలో ఇన్‌చార్జ్ ఓఎస్‌డీగా సుధాకర్ రావును నియమించారు. లైంగిక వేధింపుల ఆరో పణలపై నివేదిక సమర్పించాలని ఐదుగురు సభ్యు లతో కూడిన కమిటీని మంత్రి ఏర్పాటు చేశారు.
ఈ మేరకు మంత్రి తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ (స్పోర్ట్స్) శైలజా రామయ్యర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) వైస్‌చైర్మన్, ఎండీ, క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమిటీ సభ్యు లు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పోర్ట్స్ స్కూల్‌లోని బాలికలు, సిబ్బందిని వేర్వేరు గా విచారించారు. పాఠశాలతోపాటు బాలికల హాస్టల్‌లోని సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారు.
విచారణ ముగిశాక ఈ కమిటీ నివేదికను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు అందించనుంది. కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. కాగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ట్వీట్ చేశారు.
ఓఎస్‌డీని వెళ్లొద్దంటూ కారుకు అడ్డుగా నిలిచిన బాలికలు
సస్పెండ్ అయిన హరికృష్ణను స్పోర్ట్స్ స్కూల్ నుంచి వెళ్లొద్దంటూ కొందరు బాలికలు కారుకు అడ్డుగా నిలిచారు. మీరు లేకుంటే స్కూల్ అభివృద్ధి జరగదని, మీరు ఎలాంటి తప్పు చేయలేదని క్యాంపస్‌లోనే ఉండాలంటూ వారు భావోద్వేగానికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment