జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి
-
శాప్ ఓఎస్‌డీ రామకృష్ణ
గుంటూరు స్పోర్ట్స్: స్థానికంగా ఉన్న సదుపాయాలను వినియోగించుకుని జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని స్పోర్ట్స్ ఆ«థారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓఎస్‌డీ పీ రామకృష్ణ సూచించారు. ఎన్టీఆర్ స్టేడియం, ఓలేటి శరత్ (లండన్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఓలేటి విజయలక్ష్మి ఓపెన్ మెమోరియల్ పురుషుల డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. 35 ప్లెస్ డబుల్స్ విభాగంలో డాక్టర్ అన్వర్, డాక్టర్ జాకీర్‌ల జంట విజేతలుగా, ఎన్.అప్పారావు, పి.కిరణ్ జంట రన్నరప్‌గా నిలిచారు. 50 ప్లెస్ విభాగంలో బి.సత్యనారాయణ, సారథిల జంట ప్రథమ, ఎం.విజయ్ కుమార్, సురేష్‌ల జంట ద్వితీయ స్థానాలు సాధించారు. సోమవారం స్థానిక బందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన శాప్ ఓఎస్‌డీ రామకృష్ణ విజేతలకు ట్రోఫీలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్‌ల ద్వారా క్రీడాకారుల్లో ప్రతిభ వెలికి వస్తుందన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఓలేటి శరత్ మాట్లాడుతూ టెన్నిస్ అభివృద్ధి కోసం తన తల్లి పేరున టోర్నమెంట్ నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఏస్పీ సత్యనారాయణ, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి చారి, టీ.వీ.రావు, దిషా ల్యాబ్ అధినేత డాక్టర్ లతీఫ్, ఘంటా నారాయణ, ఘంటా నాగమణి, శివరామకృష్ణ, సూర్యనారాయణరెడ్డి, రమణ, టెన్నిస్ కోచ్ జి.వి.ఎస్ ప్రసాద్, క్రీడాకారులు పాల్గొన్నారు.