
తిరుమల: వేలకోట్ల రూపాయల విలువచేసే తిరుమలేశుని ఆభరణాలు భద్రపరిచే గది రెండు తాళాలు డాలర్ శేషాద్రి వద్ద ఎందుకు ఉంచారు? రిటైర్ అయిన ఉద్యోగిని ప్రత్యేక అధికారాలతో ఎందుకు కొనసాగించాల్సి వస్తోంది?’అని టీటీడీ మాజీ సీవీఎస్‌వో రమణకుమార్ ప్రశ్నించారు.
2008లో టీటీడీ సీవీఎస్‌వోగా పనిచేసిన రమణకుమార్ తిరుపతిలోని పోలీస్ అతిథిగృహంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ గతంలో తిరుమలలో జరిగిన 300 డాలర్లు కుంభకోణంపై విచారించే సమయంలో పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులు ప్రస్తావించారన్నారు. శ్రీవారి ఆభరణాలు, శ్రీవారి నగదు భద్రపరుస్తున్న బొక్కసం గది రెండు తాళాలు డాలర్ శేషాద్రి వద్ద ఉండకూడదని నివేదిక సమర్పించానన్నారు.