తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ పి.శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి (69) ఆదివారం తిరిగి విధుల్లో చేరారు. అనారోగ్యం కారణంగా గత 40 రోజులుగా డాలర్ శేషాద్రి ఆసుపత్రికే పరిమితమయ్యారు. కిడ్నీలకు వైద్యం చేయించుకుని తిరిగి స్వామివారి సేవకు వచ్చానని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు స్వామి వారి సేవలోనే తరిస్తానని పేర్కొన్నారు.