తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయన అలసట కారణంగా అస్వస్థతకు లోనయినట్లు సమాచారం.