డాలర్ల కేసుకు స్వస్తి | Srivari dollars missing case | Sakshi
Sakshi News home page

డాలర్ల కేసుకు స్వస్తి

Published Sat, Nov 15 2014 1:46 AM | Last Updated on Mon, Aug 13 2018 3:16 PM

డాలర్ల కేసుకు స్వస్తి - Sakshi

డాలర్ల కేసుకు స్వస్తి

టీటీడీ ఉద్యోగి  వెంకటాచలంను ముద్దాయిగా తేల్చిన కోర్టు  
ఆరోపణల నుంచి శేషాద్రితోపాటు  మరికొందరికి విముక్తి
మలుపులు తిరిగిన కేసు ..టీటీడీ చరిత్రలో మరక  

 
తిరుమల :  సంచలనం రేపిన శ్రీవారి డాలర్ల గల్లంతు కేసుకు చిత్తూరు కోర్టు శుక్రవారం ముగింపు పలికింది. దాదాపు ఎనిమిదేళ్లు సాగిన మూడొందల బంగారు డాలర్ల కుంభకోణం కేసులో టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకటాచలపతిని ముద్దాయిగా తేల్చింది. మూడేళ్ల జైలు, జరిమానా విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాలర్ శేషాద్రితోపాటు మరికొందరు అధికారులు విముక్తి పొందారు. అయితే, ఈ డాలర్ల కుంభకోణం మాత్రం టీటీడీ చరిత్రలో మరకలా మిగిలిపోనుంది.
 
డాలర్ల కేసు ఇలా..

 
తిరుమల ఆలయంలో భక్తులకు విక్రయించే బంగారు డాలర్లు 300 గల్లంతైన విషయం 2006 జూన్‌లో వెలుగుచూసింది. ఈ  కేసును టీటీడీ విజిలెన్స్, పోలీసు, సీబీసీఐడీ దర్యాప్తు చేశాయి. తొలుత తిరుమల ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటాచలంను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడంతోపాటు అప్పటి టీటీడీ సీవీఎస్‌వో రమణకుమార్ నివేదిక ఆధారంగా ఆలయ డెప్యూటీ ఈవో రెడ్డివారి ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్, ఆలయ బొక్కసం ఇన్‌చార్జిగా పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్‌డీగా కొనసాగిన డాలర్  శేషాద్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ముగ్గురిపై అప్పటీ ఈవో కేవీ.రమణాచారి వేటు వేశారు. ఈ వ్యవహారంలో ఈవో చర్యను టీటీడీ అధికార, ఉద్యోగ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. దీంతో ఆ ముగ్గురిపై సస్పెన్షన్ తొలగిస్తూ అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించడ ంతో సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. తర్వాత డెప్యూటీ ఈవో ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్ ఉద్యోగ విరమణ పొందారు. కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్‌డీగా డాలర్ శేషాద్రి మాత్రం కొనసాగారు. శేషాద్రి కొనసాగింపుపై తిరుపతికి చెందిన మాంగాటి గోపాల్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో డాలర్ శేషాద్రిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. డాలర్ శే షాద్రి కూడా హైకోర్టును ఆశ్రయించి 14 నెలల విరామం తర్వాత 2012లో తిరిగి ఆలయ ఓఎస్‌డీగా విధుల్లో చేరారు. ఈ తరుణంలో దాదాపుగా ఎనిమిదేళ్లు సాగిన డాలర్ల కుంభకోణం కేసుపై చిత్తూరు కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ముద్దాయిగా వెంకటాచలంను తేల్చి మూడేళ్ల జైలు, జరిమానా విధించింది. అయితే శ్రీవారి బంగారు డాలర్ల కేసు మాత్రం టీటీడీ చరిత్రలో మరకలా నిలిచిపోనుంది. సాక్షాత్తు స్వామి కొలువైన ఆలయంలోనే భక్తులకు విక్రయించే సుమారు 300 బంగారు డాలర్లు గల్లంతు కావడంపై దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆలయ పోషణ, అందులో 81 ఏళ్ల చరిత్ర కలిగిన టీటీడీ పాలనలో డాలర్ల కేసొక మరకలా మిగిలిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
 
డాలర్ల కేసుతో శ్రీవారి ఆభరణాలకు అదనపు రక్షణ

డాలర్ల కుంభకోణంతో శ్రీవారి ఆభరణాలకు రక్షణ చేకూరునట్టైంది. భక్తులు హుండీలో వేసిన బంగారు ఆభరణాలు కరిగించి తయారు చేసిన బంగారు డాలర్లు గల్లంతు కావడంతో టీటీడీ ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిగణించింది. ఆలయం బొక్కసంలో ఉండే 13 తిరువాభరణ రికార్డుల్లోని శ్రీవారి ఆభరణాల భద్రతపై దృష్టిసారించింది. శ్రీవారి ఆభరణాల విషయంలో నేరుగా ప్రభుత్వం, కోర్టులు జోక్యం చేసుకుని వాటిపై జస్టిస్ జగన్నాథ్, జస్టిస్ వాద్వా కమిటీలను నియమించాయి. వారు పలుమార్లు ఆలయాన్ని సందర్శించారు. రికార్డులు, ఆభరణాలు పరిశీలించి నివేదికలిచ్చారు. స్వామి ఆభరణాల భద్రతపై విలువైన సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఖచ్చితంగా అమలు చేసేలా టీటీడీ ఉన్నతాధికారులను బాధ్యులను చేశారు. ప్రస్తుతం వారి సూచనల ప్రకారం స్వామి ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. అలాగే, ఆలయంలోనే నగల పరిశీలన కోసం ల్యాబొరేటరీ ప్రారంభించారు.
 
కేసును టీటీడీ విజిలెన్స్, పోలీసు, సీబీసీఐడీ దర్యాప్తు చేశాయి. తొలుత తిరుమల ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటాచలపతిని సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడంతోపాటు అప్పటి టీటీడీ సీవీఎస్‌వో రమణకుమార్ నివేదిక ఆధారంగా ఆలయ డెప్యూటీ ఈవో రెడ్డివారి ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్, ఆలయ బొక్కసం ఇన్‌చార్జిగా పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్‌డీగా కొనసాగిన డాలర్  శేషాద్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ముగ్గురిపై అప్పటీ ఈవో కేవీ.రమణాచారి వేటు వేశారు. ఈ వ్యవహారంలో ఈవో చర్యను టీటీడీ అధికార, ఉద్యోగ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. దీంతో ఆ ముగ్గురిపై సస్పెన్షన్ తొలగిస్తూ అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించడంతో సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. తర్వాత డెప్యూటీ ఈవో ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్ ఉద్యోగ విరమణ పొందారు. కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్‌డీగా డాలర్ శేషాద్రి మాత్రం కొనసాగారు. శేషాద్రి కొనసాగింపుపై తిరుపతికి చెందిన మాంగాటి గోపాల్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో డాలర్ శేషాద్రిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పిం చారు. డాలర్ శే షాద్రి హైకోర్టును ఆశ్రయించి 14 నెలల విరామం తర్వాత 2012లో తిరిగి ఆలయ ఓఎస్‌డీగా విధుల్లో చేరారు. దాదాపుగా ఎనిమిదేళ్లు సాగిన డాలర్ల కుంభకోణం కేసుపై చిత్తూరు కోర్టు తుది తీర్పు వెల్లడిం చింది. ముద్దాయిగా వెంకటాచలపతిని తేల్చి మూడేళ్ల జైలు, జరిమానా విధించింది. అయి తే శ్రీవారి బంగారు డాలర్ల కేసు మాత్రం టీటీడీ చరిత్రలో మరకలా నిలిచిపోనుంది. సాక్షాత్తు స్వామి కొలువైన ఆలయంలోనే భక్తులకు విక్రయించే సుమారు 300 బంగారు డా లర్లు గల్లంతు కావడంపై దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆలయ పోషణ, అందులో 81 ఏళ్ల చరిత్ర కలిగిన టీటీడీ పాలనలో డాలర్ల కే సు ఒక మరకలా మిగిలిపోనుంది.
 
డాలర్ల కేసుతో శ్రీవారి ఆభరణాలకు అదనపు రక్షణ

డాలర్ల కుంభకోణంతో శ్రీవారి ఆభరణాలకు రక్షణ చేకూరునట్టైంది. భక్తులు హుండీలో వేసిన బంగారు ఆభరణాలు కరిగించి తయారు చేసిన బంగారు డాలర్లు గల్లంతు కావడంతో టీటీడీ ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిగణించింది. ఆలయం బొక్కసంలో ఉండే 13 తిరువాభరణ రికార్డుల్లోని శ్రీవారి ఆభరణాల భద్రతపై దృష్టిసారించింది. శ్రీవారి ఆభరణాల విషయంలో నేరుగా ప్రభుత్వం, కోర్టులు జోక్యం చేసుకుని వాటిపై జస్టిస్ జగన్నాథ్, జస్టిస్ వాద్వా కమిటీలను నియమించాయి. వారు పలుమార్లు ఆలయాన్ని సందర్శించారు. రికార్డులు, ఆభరణాలు పరిశీలించి నివేదికలిచ్చారు. స్వామి ఆభరణాల భద్రతపై విలువైన సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఖచ్చితంగా అమలు చేసేలా టీటీడీ ఉన్నతాధికారులను బాధ్యులను చేశారు. ప్రస్తుతం వారి సూచనల ప్రకారం స్వామి ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. అలాగే, ఆలయంలోనే నగల పరిశీలన కోసం ల్యాబొరేటరీ ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement