మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి | Dollar seshadri is back ttd | Sakshi
Sakshi News home page

మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి

Published Tue, Oct 14 2014 12:49 PM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి - Sakshi

మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి

తిరుపతి: శ్రీవారి సేవకు రేపటి నుంచి అంకితమవుతానని టీటీడీ ఒఎస్డీ డాలర్ శేషాద్రి వెల్లడించారు. మంగళవారం తిరుపతిలో శేషాద్రి సాక్షితో మాట్లాడుతూ... కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి తనకు పునర్జన్మ కల్పించారన్నారు. ఆయన ఆశీస్సులతోనే ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన గుండెపోటుకు గురైన తాను... దాదాపు 30 గంటలు అపస్మారక స్థితిలో ఉన్నానని శేషాద్రి గుర్తు చేశారు.

ఆ సమయంలో టీటీడీ అధికారులు అండగా నిలిచారని... వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్వామి వారి సేవలో ఉన్నానని చెప్పారు. అన్యారోగ్యంతో ఉన్నప్పుడు తనపై కొందరు చేసిన వ్యతిరేక భావనను పట్టించుకోనని డాలర్ శేషాద్రి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement