'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు' | Sting is a conspiracy to unseat me, my wife is innocent, says stung Karnataka Minister H Anjaneya | Sakshi
Sakshi News home page

'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు'

Published Fri, Nov 6 2015 4:47 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు'

'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు'

న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

'నన్ను ఆ కుర్చీలో లేకుండా చేసేందుకు భారీ కుట్ర చేశారు. నేను దళితుడిని. పైగా దళితుల్లోనే అత్యంత తక్కువ కులానికి చెందిన వాడిని. చాలామందికి నేను అధికారంలో ఉండటం నచ్చడం లేదు. నా రాజకీయ భవిష్యత్తును ముగించేందుకు చాలామంది కుట్ర పన్నారు. సాధారణంగా నా ఇంటికి ఎప్పుడూ అతిథులు బహుమతులు, స్వీట్లతో వస్తుంటారు. నా భార్య ఏమి తెలియని ఒక పల్లెటూరు మహిళ. ఆ టీవీ వాళ్లు బహుమతి అని చెప్పి ఇస్తేనే తీసుకుంది. పైగా అందులో డబ్బు లేదని ఏవో కార్డులని చెప్పి తీసుకున్న తర్వాత డబ్బుతో నిండిన బహుమానం అని చెప్పారు. మాపై ఇలాంటి జులుం ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతుండటం చూస్తూనే ఉన్నాం' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement