పొదలకూరు : వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే అధికారం ఉన్నా, లేదని దుష్ర్పచారం చేస్తూ టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే అర్హత ఉందని కిందిస్థాయి అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులను అందజేసినా టీడీపీ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్ జారీ చేసే తమపార్టీ అభ్యర్థుల వివరాలను సంబంధిత అధికారులకు అందజేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే రాణించలేమని తెలిసి ప్రలోభాలకు గురిచేసి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు ధ్వజమెత్తారు. టీడీపీ ఎత్తులను తిప్పికొట్టి స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మెజారిటీ సాధించిన మండలాల్లో మండలాధ్యక్షులు,ఉప మండలాధ్యక్షులను ఎన్నుకుంటామని తెలిపారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించి వైఎస్సార్‌సీపీకి మండల పరిషత్ పీఠాలను అప్పజెప్పిన ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 30 రోజులు కావస్తున్నా ఇంతవరకు రుణమాఫీ ప్రక్రియ చేపట్టకుండా కమిటీలతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. కనుపర్తి నివాసి అట్లా జానకిరామిరెడ్డికి చెందిన స్టేట్‌బ్యాంక్ ఖాతాలోని రూ.70 వేలను ఎలాంటి నోటీసులు లేకుండా పంట రుణానికి జమచేసుకున్నారన్నారు. ఇంతకంటే దారుణం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఖా తాలో ఈ నెల ఒకటిన రూ.1,37,070 జమచేయగా అందులో నుంచి బ్యాంకు అధికారులు రూ.70 వేలు రుణ బకాయిలకు జమచేసుకోవడం పరిశీలిస్తే ప్రభుత్వం రుణమాఫీ అమలులో ఎంత వైఫల్యం చెం దిందో అర్థమవుతుందన్నారు. పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి ఉన్నారు.
టీడీపీవి నీచ రాజకీయాలు
Published Fri, Jul 4 2014 2:46 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement