గోవర్దన్‌రెడ్డి
ల్యాండ్‌మైన్ పేలుడుతో ఘటన
మహబూబ్‌నగర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దాస్‌గూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్‌కు పాలమూరు జిల్లాకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ మృత్యువాత పడ్డాడు. కోయిలకొండ మండలం సంగనోనిపల్లి గ్రామానికి చెందిన గోవర్దన్‌రెడ్డి (28) రెండేళ్ల కిందట సీఆర్‌పీఎఫ్ దళంలో చేరాడు. ఆదివారం అక్కడ ప్రారంభించబోయే రోడ్డును శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆర్‌ఓపీ (రోడ్డు ఆపరేషన్ పార్టీ) జవాన్లు తనిఖీలు నిర్వహిస్తుండగా సమీపంలోని కల్వర్ట్ కింద గతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్ పేలింది. అదే బృందంలో ఉన్న గోవర్దన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
సహచర జవాన్లు అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బెటాలియన్ అధికారులు ఆయన మృతదేహాన్న్ని రాయగఢ్‌కు తరలించి ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపించారు. సోమవారం స్వగ్రామంలో గోవర్దన్‌రెడ్డికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి.