కోట, న్యూస్‌లైన్: ఉపాధ్యాయులను బాడీగార్డుల్లా తిప్పుకుంటున్నారా అని ఎంఈఓ శ్రీనివాసులుపై కలెక్టర్ శ్రీకాం త్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కర్లపూడి పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో కలెక్టర్ శ్రీకాంత్ మంగళవారం పర్యటించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ఎంఈఓ శ్రీనివాసులు తో పాటు ఉన్న కొందరు ఉపాధ్యాయులను మీరెవరని కలెక్టర్ ప్రశ్నించారు. తాము ఎమ్మార్పీలమని వారు తెలి పారు. ఎమ్మార్పీ వ్యవస్థలేదు కదా, ఉపాధ్యాయులను మీకు బాడీగార్డులగా తిప్పుకుంటున్నారా అంటూ ఎం ఈఓపై కలెక్టర్ మండిపడ్డారు.
ఎం ఈఓతో పాటు ఉన్న ఉపాధ్యాయుడు రమేష్‌ను ‘నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావ్? పాఠశాలకు వెళ్లి ఎన్ని రోజులైంది’ అని కలెక్టర్ ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో డీఈఓ ఆఫీసుకు సరెండర్ చేయాలని కలెక్టర్ అదేశించారు. గిరిజనకాలనీలో ఖాళీగా ఉన్న గిరిజనుల నివాసాలను ఆయన పరిశీలించారు. దెయ్యాల భయంతో గిరిజనులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లినట్టు కలెక్టర్‌కు చెప్పారు. గృహాలను వినియోగంలోకి తేవాలని, పరిసరాలను శుభ్రం చేసి ఇతరులకు కేటాయిం చాలని అధికారులకు సూచించారు. గిరిజనులు వలస వెళ్లడానికి కారణం మూఢనమ్మకాలు కాదని, రాజకీయ కక్షల కారణంగానే కొందరు రాత్రిపూట గిరిజనులను భయపెట్టి ఖాళీ చేయిం చారని స్థానికులు వివరించారు.
పథకాలపై ఆరా
ప్రశాంతినగర్ గిరిజన కాలనీ పక్కా గృహాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పథకాలు ఏ విధంగా సద్వినియోగ పరచుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల దూరం కావడంతో పిల్లలు వెళ్లలేక పోతున్నారని వారు కలెక్టర్ దృష్టికి తేగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులకు ఆయన సూచించారు. కర్లపూడి పంచాయతీ పరిధిలో 11 బెల్టుషాపులు ఉన్నాయని, శాంతిభధ్రతలకు విఘాతం కలుగుతోందని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వాటిని తొలగించాలని శ్రీకాంత్ ఆదేశించారు. చిట్టేడు ఎస్టీ గురుకులంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిపారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ వర్షిణి, గూడూరు ఆర్‌డీఓ మధుసూదన్‌రావు, కోట తహశీల్దార్ చెన్నయ్య, ఎంపీడీఓ వెంకటనారాయణ, ఎస్‌పీహెచ్‌ఓ సుందరరావు ఉన్నారు.
సొనకాలువల పరిశీలన
చిల్లకూరు:మండల తీరప్రాంతంలోని వేళ్లపాళెం రెవెన్యూ పరిధిలో కాకువారిపాళెం గ్రామసమీంలోని మొండి సొనకాలువను మంగళవారం కలెక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. సొనకాలువల ద్వారా రెండు పంటలు పండించుకుంటున్నామని, అయితే సిలికా భూముల్లో లోతుగా తవ్వకాలు చేపట్టడంతో సొనకాలువలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పంటలు పండించుకోలేకపోతున్నామంటూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామసర్పంచ్ రావుల వెంకటేశ్వర్లు కలెక్టర్‌తో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సొనకాలువకు మరమ్మతులు చేయడం కష్టమవుతుందన్నారు. జనవరిలో మరమ్మతులు చేపడితే సౌలభ్యంగా ఉం టుందన్నారు. మరోసారి పరిశీలిస్తామని కలెక్టర్ అన్నారు. వాకాడు: స్థానిక ఎన్‌బీకేఆర్ 30 పడకల ప్రభుత్వాస్పత్రి పనితీరుపై కలెక్టర్ శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కు.ని. ఆపరేషన్లు సరిగా జరగడం లేదని గుర్తించారు.
ఉపాధ్యాయులను బాడీగార్డుల్లా తిప్పుకుంటున్నారా?
Published Wed, Oct 23 2013 3:46 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement