ఉప్పునుంతల/గట్టు/ఆత్మకూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఉప్పునుంతల మం డలం వెల్టూరు, గట్టు మండలకేంద్రం లో, ఆత్మకూర్ జెన్‌కో దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ ప నులవద్ద బుధవారం జరిగిన వేర్వేరు విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెంద గా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా.. ఉప్పునుంతల మండలం వెల్టూరులో బుధవారం ఉదయం గొర్ల శ్రీనివాసులు (38) వి ద్యుదాఘాతంతో చనిపోగా అతని భార్య తృటిలో ప్రమా దం నుంచి బయటపడింది.
నివాసులు సోదరుడు వెంకటయ్య ఇంటి నిర్మాణానికి నీళ్లు పట్టడానికి రోజు లాగే భార్యాభర్తలిద్దరు వెళ్లారు. మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు విద్యుత్ సర్వీస్‌వైరు తెగి ఇంటి పైకప్పు మీదున్న ఇనుపచువ్వపై పడింది. గమనించని శ్రీనివాసులు తడిగా ఉన్న చేతుల తో బయటికి తేలి ఉన్న ఇనుప చువ్వను పట్టుకోవడంతో విద్యుదాఘాతం సంభవించింది.
పెద్దగా కేకవేయడంతో పక్కనే ఉన్న భార్య వసంత కాపాడే ప్రయత్నం చేసి గాయపడింది. రోదిస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచేలోపు శ్రీనివాసులు షాక్‌కు కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడిన వసంతను గ్రామస్తులు 108 అంబులెన్స్‌లో అచ్చం పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ట్రాన్స్‌కో ఏడీఈ తౌర్యానాయక్, ఎమ్మా రై సుల్తాన్, వీఆర్వో భాస్కర్‌లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతుని తమ్ముడు వెంకటయ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ యాదిరెడ్డి తెలిపారు.
వేర్వేరు చోట్ల విద్యుత్ ప్రమాదాలు
Published Thu, May 29 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement