నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: వివాహిత అదృశ్యంపై ఒకటో నగర పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరంలోని మూలాపేటకు చెందిన అళహరి వాసుకు బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన కల్పనతో 10 ఏళ్ల కిందట వివాహమైంది. వాసు కుక్కర్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
వారికి ఇద్దరు పిల్లలున్నారు. గత కొద్ది రోజులుగా కల్పన ప్రవర్తన సరిగాలేకపోవడంతో దంపతుల నడుమ విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ రాత్రి కల్పన ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఆమె కోసం భర్త గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఒకటోనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ మద్ది శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
Published Thu, Oct 31 2013 3:26 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement