శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో ఉగాది మహోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలు రూ.1,57,81,90గా ఈఓ సాగర్‌బాబు తెలిపారు.
శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో ఉగాది మహోత్సవాలలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు రూ.1,57,81,930 వచ్చినట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. బుధవారం శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో అధికారులు, సిబ్బంది లెక్కింపు చేపట్టారన్నారు. నగదుతో పాటు యూఎస్‌ఏ డాలర్లు 51, దిర్హమ్స్5, బహ్రేయిన్ దినార్స్ 2 లభించాయన్నారు. ఈ నెల 2 నుంచి బుధవారం వరకు మొత్తం 11 రోజులకు స్వామి అమ్మవార్లకు వచ్చిన ఆదాయంగా ఈఓ వెల్లడించారు.