![Kodali Nani Comments On Movie Industry Issues - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/3/Nani.jpg.webp?itok=JO9D7dLe)
సాక్షి, హైదరాబాద్: నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం రామానాయుడు స్టూడియోలో 'ఆటో రజనీ' మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జొన్నలగడ్డ హరి హీరోగా, శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమాకు మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఎంపీ నందిగం సురేష్ క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను నమ్ముకున్న వారందరికీ న్యాయం జరగాలి. ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని మేము సమర్థించము. కొంతమందికి లాభాలు తెచ్చిపెట్టాలని విధానపరంగా సరైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచారు. చిన్న సినిమాలు ఆడాలి పెద్ద సినిమాలు ఆడాలి. పవన్ కల్యాణ్ ఆహు అంటే అదిరి బెదిరి పోయే వాళ్లము కాదు' అని మంత్రి కొడాలి నాని అన్నారు.
చదవండి: ('పవన్ కల్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు')
Comments
Please login to add a commentAdd a comment