
సాక్షి, తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆన్‌లైన్ కల్యాణోత్సవ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ తేదీల్లో కల్యాణోత్సవం లేదు. ఆన్‌లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. (చదవండి: సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు)
తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. (చదవండి: సీఎం జగన్‌ను అభినందించిన ప్రధాని మోదీ)
Comments
Please login to add a commentAdd a comment