srivari kalyanam
-
కెనడా,యూఎస్‌లో వైభవంగా జరగనున్న శ్రీవారి కళ్యాణోత్సవాలు: వివరాలివిగో!
కెనడా, అమెరికాలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం జూన్ 4వ తేదీ నుండి జూలై 23 వ తేదీవరకు పద్నాలుగు నగరాల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈసందర్బంగా కెనడా, యూఎస్‌లో “శ్రీనివాస కళ్యాణోత్సవం” పోస్టర్లను తాడేపల్లి కార్యాలయంలో ఉదయం (11.05.2023) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ ఎస్. మేడపాటి, టూరిజం అధ్యక్షులు వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు స్త్రీ, శిశు సంక్షేమఅభివృద్ధి, కాపు కార్పోరేషన్ అధ్యక్షులు అడపా శేషు, ఇతర కార్పోరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ 2022 నెలల్లో USA, UK & Europe లలోని 20 నగరాల్లో అత్యంత వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణాలు ఆయా దేశాలలోని తెలుగు అసోసియేషన్ల, ధార్మిక సంస్థల సహకారంతో నిర్వహించామన్నారు. గత నెల 28వ తేదీన బహ్రెయిన్‌లో నిర్వహించిన కళ్యాణోత్సవానికి దాదాపు 15 వేలమందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారన్నారు. కెనడా యూఎస్‌లలోని పలు తెలుగు అసోసియేషన్లు, ధార్మిక,సేవా సంస్థల కోరిక మేరకు ఆయా దేశాలలోని భక్తులకోసం తితిదే శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ఆయా నగరాల్లోని కార్యనిర్వాహకులతో సమన్వయం చేస్తోందన్నారు. తితిదే నియమాల ప్రకారం శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వెళ్ళే అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలవుతుంది. తిరుమలలో లాగానే శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆయా నగరాల్లో తెలుగు, భారతీయ అసోసియేషన్లు లడ్డూ ప్రసాదాలతో పాటు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. ఉచితంగా శ్రీవారి కళ్యాణోత్సవం తిలకించడానికి అందరూ ఆహ్వానితులే. భక్తులందరూ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. కెనడా, అమెరికాలో దేవదేవుని కళ్యాణాలు నిర్వహించడానికి ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అక్కడి ఏర్పాట్లు, తదితర విషయాల్లో ఇటు తితిదే అర్చకులు, అటు వేద పండితులతో సమన్వయం చేస్తున్నామని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెల్లడించారు. కెనడా , యూఎస్‌లో “శ్రీనివాస కళ్యాణం” జరిగే నగరాలు, తేదీలు Toronto, ON, Canada - 4th June, 2023 Montreal, Quebec, Canada – 10th June, 2023 Ottawa, ON, Canada – 11th June, 2023 Raleigh, NC, USA – 17th June, 2023 Jacksonville, FL, USA – 18th June. 2023 Detroit, MI, USA – 24th June, 2023 Chicago, IL, USA- 25th June, 2023 Atlanta, GA, USA – 1st July, 2023 Dallas, TX, USA – 2nd July, 2023 St. Louis, MO, USA – 6th July, 2023 Philadelphia, PA, USA – 9th July, 2023 Morganville, NJ, USA – 15th July, 2023 Houston, TX, USA – 16th July, 2023 Irving, TX, USA – 21st – 23rd July, 2023 (Srivari Kalyanam & Brahmotsavams) అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో NRIలు పాల్గొని, ఆ దేవదేవుడి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. -
అలనాడు బ్రహ్మోత్సవాలే... కల్యాణోత్సవాలు
శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిత్యకల్యాణోత్సవం జరుగుతుంది. కాని ప్రాచీనకాలంలో ఈ నిత్యకల్యాణోత్సవ సంప్రదాయం ఉన్నట్లు కనిపించదు. అప్పట్లో బ్రహ్మోత్సవాలనే స్వామివారి కల్యాణోత్సవాలుగా భావించేవారని తెలుస్తోంది. కాని బ్రహ్మోత్సవాలలో స్వామివారికి, అమ్మవారికి కల్యాణం చేసే ఉత్సవం ఏమీ ఉండదు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివాహోత్సవాన్ని మొదటిసారి 1546 జూలై 17వ తేదీన తాళ్లపాక పెద తిరుమలాచార్యులు ప్రారంభించినట్లు శాసనంలో కనిపిస్తుంది. ఆనాటి సంప్రదాయంగా ఐదు రోజులు శ్రీవారి వివాహ కార్యక్రమాన్ని దగ్గరుండి ఎంతో ఘనంగా నిర్వహించారు. అనురాధ నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ వరకు ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను మార్చి, ఏప్రిల్ మాసాలలో నిర్వహించేవారు. ఆ రోజుల్లో 5 రోజుల వివాహంలో జరిగే అన్ని తతంగాలను, లాంఛనాలను ఈ వివాహంలో జరిపించేవారు. స్వామివారికి అభ్యంగనస్నానం, తిరుమంజనం, నూతన వస్త్రధారణ, తిరువీథి ఉత్సవం, నైవేద్యం, స్వామివారిని, దేవేరులను ఉయ్యాలపై ఉంచి చేసే ఉయ్యాలసేవ, పెళ్లికొడుకు పాదాలను క్షీరంతో అభిషేకించడం, ధ్రువనక్షత్ర దర్శనం, చందన వసంతోత్సవం, కల్యాణహోమం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, పూలబంతి ఆట... ఇలా అన్ని వేడుకలను ఐదు రోజులపాటు వివాహోత్సవం కార్యక్రమంలో నిర్వహించేవారు. తాళ్లపాక వారు ఏర్పాటు చేసిన ఈ ఉత్సవంలో తాళ్లపాక వంశీయులు ప్రధానపాత్ర వహించి స్వామివారికి కన్యాదానం చేసే సంప్రదాయం మెదలైంది. అటు తరువాత ఈ కార్యక్రమం నిత్య కల్యాణోత్సవంగా రూపాంతరం చెంది ప్రతినిత్యం నిర్వహిస్తున్నారు. కన్య తరపున తాళ్లపాక వంశీకులే కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ అన్నమయ్య వంశీకులకు టీటీడీ ప్రత్యేకంగా సంభావన, ప్రసాదాలు అందిస్తోంది. ఐదు రోజులపాటు వైభవంగా స్వామివారికి నిర్వహించే కల్యాణోత్సవం ఖర్చుల నిమిత్తం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు కొండవీడు సీమలోని శెందళూరు అనే గ్రామం, మల్లవరం అనే గ్రామాన్ని దేవదాయం చేశాడట. అ సమయంలో మలయప్పస్వామి, దేవేరులకే కాకుండా, ఆలయంలో శ్రీకృష్ణునికి, వరాహస్వామివారికి నైవేద్య సమర్పణ జరిగింది. మనోహరం అనే ప్రసాదం కూడా అప్పుడే స్వామివారికి సమర్పించడం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా స్వామివారి కల్యాణోత్సవం గురించి లిఖించిన శాసనంలోనే ప్రస్తావించారు. అంతకు పూర్వం ఈ నైవేద్యం గురించి ఎక్కడా ప్రస్తావన లేదట. ఇది ఒక రకమైన బెల్లపు లడ్డు, సున్నుండ లాంటిది. 16వ శతాబ్దం మధ్యభాగంలో మొదలైన ఈ ప్రసాదం 20వ శతాబ్దం మధ్య భాగం వరకు చాలా ప్రాచుర్యంలో వుండేది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే ముఖ్య భక్తులకు దేవస్థానం ఇచ్చే ప్రధాన ప్రసాదంగా పేరు తెచ్చుకుంది. దాని స్థానంలో ఇప్పుడు తిరుపతి లడ్డూగా పేరుగాంచిన శనగపిండి లడ్డూ ప్రాముఖ్యానికి వచ్చింది. రుచిలో... నాణ్యతలో తిరుపతి లడ్డూనే దానికది సాటిగా పేరు తెచ్చుకుంది. (చదవండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...) -
తిరుమల: ఆన్లైన్ టికెట్ల అక్టోబర్ కోటా విడుదల
సాక్షి, తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆన్లైన్ కల్యాణోత్సవ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ తేదీల్లో కల్యాణోత్సవం లేదు. ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. (చదవండి: సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు) తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. (చదవండి: సీఎం జగన్‌ను అభినందించిన ప్రధాని మోదీ) -
అంగరంగ వైభవం.. శ్రీవారి కల్యాణం
రాయదుర్గం టౌన్ : విశిష్ట సంప్రదాయ పద్ధతిలో ప్రసన్న వేంకటరమణస్వామి కల్యాణోత్సవం పదకొండేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం రాయదుర్గంలో కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల సదరు బాలికకు సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఏడాది కూడా పద్మశాలీయ వంశస్తులైన రాయదుర్గంవాసి అరవ జనార్ధన, స్వప్న దంపతుల కుమార్తె అమూల్యతో శ్రీవారి వివాహం జరిపించారు. శనివారం ఉదయం స్వామివారి తరఫున పెళ్లి పెద్దలుగా బ్రాహ్మణులు, పుర ప్రముఖులు మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతి (అమూల్య)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం పెళ్లి కూతురిని శ్రీవారి ఉత్సవ విగ్రహం పక్కన కూర్చోబెట్టారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య పురోహితుల సమక్షంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపుకొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో ఓ మహిళ కట్టడంతో పెళ్లితంతు ముగిసింది. కల్యాణోత్సవానికి ఆర్డీఓ కేఎస్ రామారావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు గౌని ఉపేంద్రరెడ్డి, సోమా మల్లేశప్ప, ఆలయ పాలక మండలి చైర్మన్ తాయి శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, కౌన్సిలర్లు పేర్మి బాలాజీ, బండి భారతి, ప్రశాంతి, ముదిగల్లు జ్యోతి, సంపత్‌కుమారి, నాగవేణి తదితరులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
కమనీయం..శ్రీవారి కల్యాణం
అనంతపురం కల్చరల్ : విష్ణు సహస్రనామ సత్సంగ మండలి వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీవారి కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు స్థానిక ఆర్‌ఎఫ్‌రోడ్డులోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్ణు సహస్రనామ హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన అర్చకులు ఏఎల్ఎన్ శాస్త్రి, హరికిషోర్ శర్మ నేతృత్వంలో ఆద్యంతం భక్తిశ్రద్ధలతో కల్యాణోత్సవం జరిగింది. అంతకు ముందు ఆలయంలోలక్ష్మీ వేంకటేశ్వరుడికి సుప్రభాత సేవలు, అభిషేక, అలంకార సేవలు పెద్ద ఎత్తున జరిగాయి. కార్యక్రమంలో పలు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కమనీయం..శ్రీవారి కల్యాణోత్సవం
అనంతపురం కల్చరల్ : ధనుర్మాస పూజోత్సవం సందర్భంగా శ్రీనివాస కల్యాణం ఆదివారం కనుల పండువగా జరిగింది. స్థానిక ఆర్‌ఎఫ్‌రోడ్డులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రధాన అర్చకులు ఏఎల్ఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో నేత్రపర్వంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా కల్యాణ వేడుకలు జరిపించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ మాంగళ్యధారణ జరిగింది. మధ్యాహ్నం అన్నదానం జరిగింది. రాత్రి సర్వాంగ సుందరంగా అలంకరించిన దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను నగరవీధులలో ఊరేగించారు. వందల సంఖ్యలో గోవింద మాలధారులు శ్రీవారి నామస్మరణతో ఆనందతాండవం ముందుకు సాగింది. కార్యక్రమంలో గోవింద మాలధారుల సంఘం నేతలు నాగరాజు, సత్యనారాయణ, రమణ పాల్గొన్నారు.