రేపట్నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు! | Darshan Tickets available online from tommorrow: TTD | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు!

Published Tue, Aug 19 2014 6:01 PM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

రేపట్నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు!

రేపట్నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు!

తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్తను అందించింది. భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం అయ్యేందుకు ఆగస్టు 20 తేది నుంచి ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లను అడ్వాన్స్‌ రిజర్వేషన్ బుకింగ్ ద్వారా ప్రారభించనున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
రేపటి నుంచి ఇంటర్‌నెట్‌తోపాటు రాష్ట్రంలో ఉన్న 9 శ్రీదర్శిని కౌంటర్స్‌లో టిక్కెట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. తొలివిడతగా 5000 టిక్కెట్లను అడ్వాన్స్ రిజర్వేషన్ ద్వారా భక్తులకు కేటాయించనున్నట్టు టీటీడీ ఈవో  తెలిపారు. 
 
300 రూపాయల విలువ కలిగిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో రేపటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని టీటీడీ ఈఓ తెలిపారు. రేపు టికెట్లు బుక్ చేసుకున్నవారు ఆగస్టు 27 తేదిన దర్శనం చేసుకోవచ్చని ఈవో  తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement