ముంబై: ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో ఐపీఎల్ అభిమానులకు శుభవార్త తెలిపింది. భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)తో బుక్ మై షో కీలక ఒప్పందం చేసుకుంది. మార్చి 26న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు సంబంధించిన టికెట్ల విక్రయ హక్కులను సంస్థ పొందింది. ఈ ఒప్పందంలో భాగంగా.. ఈ ఏడాది మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై, నవీ ముంబై మరియు పూణేలలో జరిగే 70 లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను విక్రయించడంతో పాటు గేట్ ఎంట్రీ, ప్రేక్షక నిర్వహణ సేవలను కూడా బుక్ మై షో అందించనుంది.
అయితే, ఇంకా ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు వేదికను బీసీసీఐ ప్రకటించలేదు. ఈ ఐపీఎల్ 15వ సీజన్‌లో కొత్త అహ్మదాబాద్, లక్నో జట్లతో సహా ఇతర 10 జట్లు పాల్గొననున్నాయి. 70 మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ ధరలు రూ.2500 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కొనుగోలు అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు తిరిగి మన స్వదేశంలో జరగనున్నాయి. వేదికల వద్ద అభిమానులు & సిబ్బంది భద్రత & శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని బుక్ మై షో కఠినమైన కోవిడ్-ప్రోటోకాల్స్ అనుసరిస్తుందని కంపెనీ తెలిపింది. వాంఖడే స్టేడియం(ముంబై), డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం(నవీ ముంబై)లో 20 చొప్పున, బ్రాబోర్న్ స్టేడియం (ముంబై), ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం(పూణే)లో 15 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మార్చి 26న తొలి టాటా ఐపీఎల్ 2022 మ్యాచ్ ప్రారంభం కానుంది.
(చదవండి: ఆంబ్రేన్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment