TATA IPL
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. టాటా ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కావడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్ -
#IPL2023: 292 డాట్‌బాల్స్.. లక్షకు పైగా మొక్కలు
ఐపీఎల్ 16వ సీజన్లో ప్లేఆఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు స్పాన్సర్ టాటాతో కలిసి బీసీసీఐ సరికొత్త కార్యచరణ రూపొందించింది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో నయోదయ్యే ప్రతీ డాట్‌బాల్‌కు 500 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్కే విజేతగా నిలిచి ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. కాగా ప్లేఆఫ్ మ్యాచ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. మరి ప్లేఆఫ్స్ దశలో ఆడిన మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో నమోదైన డాట్‌బాల్స్‌కు ఎన్ని మొక్కలు నాటనున్నారో ఇప్పుడు చూద్దాం. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 40 ఓవర్లలో మొత్తం 84 డాట్ బాల్స్ వేశారు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు చేసిన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 96.ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 67 డాట్ బాల్స్ వచ్చాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం డాట్ బాల్స్ 45. అంటే 4 మ్యాచ్‌ల నుంచి మొత్తం 292 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే 292 x 500 లెక్కన బీసీసీఐ మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది. దీని ద్వారా గ్రీన్ డాట్ ప్రచారంలో ఐపీఎల్ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టడం విశేషం. పర్యావరణం పట్ల బీసీసీఐ బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో దీనిపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. డాట్ బాల్‌కు మొక్కలు నాటాలన్న నిర్ణయంతో క్రికెట్ అభిమానుల మెప్పు పొందుతోంది బీసీసీఐ. చదవండి: '45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే వేటు తప్పదు' లండన్ చేరుకున్న రోహిత్ శర్మ.. టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ -
ఐపీఎల్ అభిమానులకు బుక్ మై షో శుభవార్త..!
ముంబై: ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో ఐపీఎల్ అభిమానులకు శుభవార్త తెలిపింది. భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)తో బుక్ మై షో కీలక ఒప్పందం చేసుకుంది. మార్చి 26న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు సంబంధించిన టికెట్ల విక్రయ హక్కులను సంస్థ పొందింది. ఈ ఒప్పందంలో భాగంగా.. ఈ ఏడాది మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై, నవీ ముంబై మరియు పూణేలలో జరిగే 70 లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను విక్రయించడంతో పాటు గేట్ ఎంట్రీ, ప్రేక్షక నిర్వహణ సేవలను కూడా బుక్ మై షో అందించనుంది. అయితే, ఇంకా ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు వేదికను బీసీసీఐ ప్రకటించలేదు. ఈ ఐపీఎల్ 15వ సీజన్లో కొత్త అహ్మదాబాద్, లక్నో జట్లతో సహా ఇతర 10 జట్లు పాల్గొననున్నాయి. 70 మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ ధరలు రూ.2500 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కొనుగోలు అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు తిరిగి మన స్వదేశంలో జరగనున్నాయి. వేదికల వద్ద అభిమానులు & సిబ్బంది భద్రత & శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని బుక్ మై షో కఠినమైన కోవిడ్-ప్రోటోకాల్స్ అనుసరిస్తుందని కంపెనీ తెలిపింది. వాంఖడే స్టేడియం(ముంబై), డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం(నవీ ముంబై)లో 20 చొప్పున, బ్రాబోర్న్ స్టేడియం (ముంబై), ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం(పూణే)లో 15 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మార్చి 26న తొలి టాటా ఐపీఎల్ 2022 మ్యాచ్ ప్రారంభం కానుంది. (చదవండి: ఆంబ్రేన్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే!) -
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్‌తో పాటుగా దీని వేలం కూడా..!
బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం-2022 మొదలైన విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్స్‌ను దక్కించుకునేందుకు పలు ప్రాంచైజీస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కాగా ఈ ఐపీఎల్-2022 వేలంలో ప్లేయర్స్‌తో పాటుగా టాటా మోటర్స్‌కు చెందిన కారు కూడా ఆక్షన్‌లోకి రానుంది. బహుశా ఐపీఎల్ వేలంలో ప్లేయర్స్‌నే కాకుండా కారును కూడా వేలం వేయడం ఇదే తొలిసారి. వేలంలోకి టాటా పంచ్ లిమిటెడ్ ఎడిషన్..! ఐపీఎల్-2022 సీజన్‌కు టాటా సంస్థ స్పాన్సర్‌గా వ్యవహారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వేలంలో టాటా మోటార్స్‌కు చెందిన సరికొత్త 'పంచ్ కజిరంగా ఎడిషన్' కారును కంపెనీ వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని కజిరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కోసం ఖర్చు పెట్టనున్నారు. పంచ్ కజిరంగా ఎడిషన్ కారు పలు ప్రత్యేమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ ఫీచర్స్‌కు సంబంధించి ఎలాంటి విషయాలను టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. ఈ కారును కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే వేలం వేస్తున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. వేలంలో గెలిచిన వారు కజిరంగా టాటా పంచ్ స్ఫెషల్ ఎడిషన్ ఎస్యూవీ కారును సొంతం చేసుకుంటారని టాటా మోటార్స్ ప్రకటించింది. భారీ ఆదరణతో టాటా పంచ్..! గత ఏడాది లాంచ్ చేసిన టాటా పంచ్ ఎస్యూవీ భారత మార్కెట్లలో అత్యంత ఆదరణ లభిస్తోంది. టాటా మోటార్స్‌లో కూడా ఎక్కువగా సేల్ అవుతోన్న మోడల్‌గా టాటా పంచ్ నిలుస్తోంది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి నెలవారీ విక్రయాలు 40వేలను దాటడంలో ఈ ఎస్యూవీ పాత్ర కీలకంగా ఉంది. ఫీచర్స్‌లో భేష్..! టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ ఫీచర్స్‌లో అదిరిపోయింది. ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, క్రైమెట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు అత్యంత సురక్షితమైన రేటింగ్‌ను కూడా కల్గి ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ సెటప్‌తో, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 83బీహెచ్పీ వద్ద 113ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. టాటా పంచ్ ప్రారంభ ధర రూ.5.65 లక్షల నుంచి అత్యధికంగా రూ.9.29 లక్షల వరకు ఉంది.(ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్ ధర) చదవండి: అత్యంత తక్కువ ధరకే ఎస్యూవీ కార్..! ఎగబడి కొంటున్న టాటా మోటార్స్ ఎస్యూవీ కార్లు ఇవే.. -
IPL 2022: బీసీసీఐ జాక్‌పాట్ కొట్టేసింది.. అదనంగా 130 కోట్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ మారనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు లీగ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనా మొబైల్ కంపెనీ ‘వివో’ తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ‘వివో’ స్థానంలో భారత్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ ‘టాటా గ్రూప్’ లీగ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ నిర్ధారించారు. ఐపీఎల్ రెండు సీజన్లకు (2022, 2023) ఇది వర్తిస్తుంది. 2018–2022 వరకు ఐదేళ్ల కాలానికిగాను రూ.2,200 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ‘వివో’ ఒప్పందం చేసుకుంది. అయితే 2020లో గాల్వాన్ లోయలో ఘర్షణలు జరిగి భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో ఆ ఏడాది లీగ్ నుంచి వివో తప్పుకోగా, తాత్కాలిక ప్రాతిపదికన ‘డ్రీమ్ 11’ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే 2021లో మళ్లీ ‘వివో’నే కొనసాగింది. ‘వివో’ ఒప్పందాన్ని 2023 వరకు బీసీసీఐ పొడిగించింది. తాజాగా ‘వివో’ వైదొలగడంతో టాటా సంస్థ వచ్చే రెండేళ్ల పాటు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఇదీ లెక్క... వివో తప్పుకోవడంతో పాటు టాటా స్పాన్సర్‌గా రావడంతో బీసీసీఐ పంట పండింది. ఒకేసారి రెండు సంస్థల నుంచి ఆదాయం వస్తుండటంతో బోర్డు జాక్‌పాట్ కొట్టింది. టాటా గ్రూప్ రెండేళ్ల కోసం రూ. 670 కోట్లు (ఏడాదికి రూ. 335 కోట్లు) చెల్లిస్తుంది. అయితే 2022లో రూ. 547 కోట్లు, 2023లో రూ. 577 కోట్లు చెల్లిస్తామని ‘వివో’ గతంలో ఒప్పందం (రెండేళ్లకు మొత్తం రూ. 1,124 కోట్లు) కుదుర్చుకుంది. ఇప్పుడు బీసీసీఐకు ఎలాంటి అభ్యంతరం లేకున్నా వివో తమంతట తామే తప్పుకునేందుకు సిద్ధమైంది కాబట్టి ‘టాటా’ ఇస్తున్న మొత్తం పోగా, మిగిలిన నష్టాన్ని వారే భర్తీ చేయాల్సి ఉంటుంది. దాంతో వివో బోర్డుకు మరో రూ. 454 కోట్లు చెల్లిస్తుంది. ఈ క్రమంలో బోర్డు అదనంగా 130 కోట్లు పొందనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెండు కొత్త జట్లకు బీసీసీఐ అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. అహ్మదాబాద్, లక్నో జట్లకు ఆమోద ముద్ర వేసిన బోర్డు... మొదటి ప్రాధాన్యంగా ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకునేందుకు రెండు వారాల సమయం ఇస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ వేలం జరుగుతుంది. చదవండి: SA vs IND: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంఫర్ ఆఫర్.. ఐదేళ్ల తర్వాత! -
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకున్న వివో
-
ఇకపై 'వివో' కాదు 'టాటా' ఐపీఎల్.. ఐపీఎల్ 2022లో కీలక మార్పు
Tata IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా మొబైల్ సంస్థ ‘వీవో’ తప్పుకుంది. 2018 నుంచి టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న వీవో.. మరో రెండేళ్ల గడువు ఉండగానే నాటకీయ పరిమాణాల మధ్య వైదొలగడంతో దేశీయ వ్యాపార దిగ్గజం 'టాటా' టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు 2023 సీజన్‌కు కూడా టాటానే టైటిల్ స్పాన్సర్ చేయనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. కాగా, భారత్-చైనాల మధ్య వివాదాల కారణంగా 2020 సీజన్లో వీవో టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పించబడిన సంగతి తెలిసిందే. అప్పుడు వీవో స్థానంలో ‘డ్రీమ్ 11’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. చదవండి: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక సమావేశం.. ఖరారు కానున్న షెడ్యూల్!