సాక్షి,హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు.
ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.
టాటా ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కావడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి.. క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment