న్యూఢిల్లీ: ‘మీరు క్యూలో ఉన్నారు... దయచేసి కాసేపు వేచి ఉండండి’... ఈ కాసేపు కాస్తా గంట నుంచి 10 గంటల వరకు కూడా చూపించింది! చివరకు కొద్ది సేపట్లోనే అది కాస్తా ‘సోల్డ్ అవుట్’ బోర్డుతో ముగిసింది. వన్డే వరల్డ్ కప్ టికెట్ల కోసం మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రయత్నించిన భారత అభిమానుల్లో ఎక్కువ మందికి ఇదే తరహాలో నిరాశ ఎదురైంది.
భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్‌లకు సంబంధించి ‘మాస్టర్ కార్డ్’ వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి ‘బుక్ మై షో’లో టికెట్లు అందుబాటులో ఉంచారు. అయితే గంటల వ్యవధిలోనే అన్ని మ్యాచ్‌ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు 9 మ్యాచ్‌లకు కూడా ‘సోల్డ్ అవుట్’ అనే చూపిస్తోంది. నిజానికి గత బుధవారం బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం 31 ఆగస్టు నుంచి 3 సెపె్టంబర్ వరకు భారత లీగ్ మ్యాచ్‌లకు సాధారణ అభిమానుల కోసం దశలవారీగా టికెట్లు అమ్ముతారు.
అయితే ఇప్పుడు ‘సోల్డ్ అవుట్’ అంటే పూర్తిగా అమ్ముడుపోయాయా లేక పరిమిత సంఖ్యలో ‘మాస్టర్ కార్డ్’ కోసం అందుబాటులో ఉంచి మిగతా టికెట్లు ఆపి ఉంచారా తెలీదు. అసలు టికెట్ల సంఖ్య విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆయా తేదీల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment