మన దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వెహికల్ ట్రెండ్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో, దిగ్గజ కంపెనీలతో సహ స్టార్టప్ కంపెనీలు కూడా తమ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రస్తుతం లభిస్తున్న వాటిలో ఎక్కువగా స్టార్టప్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక దిగ్గజ కంపెనీ స్టార్టప్ కంపెనీల పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి రాబోతుంది. జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా మోటార్ ఇండియా ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా ఎలక్ట్రిక్ వాహనాల కోసం మా మార్కెట్'ను మదింపు చేస్తున్నట్లు ధృవీకరించారు.
"వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా నిజమైన హెచ్ఎమ్ఎస్ఐ ఎలక్ట్రిక్ వాహనాన్ని మీరు చూడగలుగుతారు" ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గత ఏడాది పూణేలోని ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఫెసిలిటీలో హోండా బెన్లీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టెస్టింగ్ చేసినట్లు తెలిపారు. బ్యాటరీ-మార్పిడి సాంకేతికతను పరీక్షించడం కోసం హోండా తన అనుబంధ సంస్థ హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'ను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బెంగళూరులో త్రిచక్ర వాహనాలలో పైలట్ ప్రాజెక్టు కింద రన్ చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు మెట్రో నగరాలకు మాత్రమే చేరువ అయ్యాయని చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ కాలేదని ఒగాటా అన్నారు. హోండా మోటార్ ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి మూడు వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించింది.
ఇప్పటికే దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బ్యాటరీ స్వాపింగ్(బ్యాటరీ ఇచ్చి ఛార్జైన బ్యాటరీ తీసుకోవడం) ప్లాట్‌ఫామ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు తైవాన్‌కు చెందిన గోగోరో ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. హీరో-బ్రాండ్ పేరు మీద మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడానికి రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్నట్లు నిరంజన్ గుప్తా వెల్లడించారు. అది మా స్వంత ఉత్పత్తి లేదా గోగోరో సహకారంతో అయిన కావొచ్చని పేర్కొన్నారు. ఈ వాహనాలు ఎప్పుడైన రావొచ్చు అని తెలిపారు.
(చదవండి: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు..!)
Comments
Please login to add a commentAdd a comment