1973లో వచ్చిన చైనీస్ చిత్రం ‘ఎంటర్ ది డ్రాగన్’లో, బ్రూస్ లీ తన ప్రత్యర్థి హాన్‌తో అద్దాల గదిలో పోరాడుతారు. అప్పుడు పలు ప్రతిబింబాలు బ్రూస్ లీని కలవరపరుస్తాయి. తమిళనాట ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురై రెబల్‌గా మారిన ఓ పన్నీర్‌సెల్వం పరిస్థితి కూడా రామనాథపురంలో బ్రూస్‌లీ మాదిరిగానే పరిణమించింది.
ఓ పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, అదే పేరుతో మరో నలుగురు తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఓటర్లకు ‘ఓ పన్నీర్‌సెల్వం’ విషయంలో గందరగోళం ఏర్పడనుంది. నిజానికి ఓ పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ డమ్మీ అభ్యర్థులను అతని ప్రత్యర్థులు రంగంలోకి దింపినట్లు సమాచారం. ఓ పన్నీర్ సెల్వంను ఎన్నికల్లో దెబ్బతీయాలన్నదే వారి లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పేరుతో ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ మద్దతు ఉండటం విశేషం.
ఓ పన్నీర్‌సెల్వం పూర్తి పేరు ఒట్టకరతేవర్ పన్నీర్ సెల్వం. పోటీలో దిగిన ఇతర అభ్యర్థులకు పన్నీర్‌సెల్వం ఒచ్చప్పన్, ఒయ్యారం, ఒయ్యతేవర్, ఒచ్తేవర్ వంటి పేర్లు చేరి ఉన్నాయి. మెక్కిలార్‌పట్టి నుంచి ఓచప్పన్ పన్నీర్‌సెల్వం, రామనాథపురం నుంచి ఊయారం పన్నీర్‌సెల్వం తదితరులు కూడా బరిలోకి దిగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment