o panneer selvam
-
రెబల్ పన్నీర్ సెల్వానికి నలుగురు పన్నీర్ సెల్వంలతో పోటీ
1973లో వచ్చిన చైనీస్ చిత్రం ‘ఎంటర్ ది డ్రాగన్’లో, బ్రూస్ లీ తన ప్రత్యర్థి హాన్‌తో అద్దాల గదిలో పోరాడుతారు. అప్పుడు పలు ప్రతిబింబాలు బ్రూస్ లీని కలవరపరుస్తాయి. తమిళనాట ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురై రెబల్‌గా మారిన ఓ పన్నీర్‌సెల్వం పరిస్థితి కూడా రామనాథపురంలో బ్రూస్లీ మాదిరిగానే పరిణమించింది. ఓ పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, అదే పేరుతో మరో నలుగురు తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఓటర్లకు ‘ఓ పన్నీర్‌సెల్వం’ విషయంలో గందరగోళం ఏర్పడనుంది. నిజానికి ఓ పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ డమ్మీ అభ్యర్థులను అతని ప్రత్యర్థులు రంగంలోకి దింపినట్లు సమాచారం. ఓ పన్నీర్ సెల్వంను ఎన్నికల్లో దెబ్బతీయాలన్నదే వారి లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పేరుతో ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ మద్దతు ఉండటం విశేషం. ఓ పన్నీర్‌సెల్వం పూర్తి పేరు ఒట్టకరతేవర్ పన్నీర్ సెల్వం. పోటీలో దిగిన ఇతర అభ్యర్థులకు పన్నీర్‌సెల్వం ఒచ్చప్పన్, ఒయ్యారం, ఒయ్యతేవర్, ఒచ్తేవర్ వంటి పేర్లు చేరి ఉన్నాయి. మెక్కిలార్పట్టి నుంచి ఓచప్పన్ పన్నీర్‌సెల్వం, రామనాథపురం నుంచి ఊయారం పన్నీర్‌సెల్వం తదితరులు కూడా బరిలోకి దిగడం గమనార్హం. -
మాజీ సీఎం మద్దతుదారుడి దారుణ హత్య
►ఎంజీఆర్ నగర్లో ఘాతుకం – ఉద్రిక్తత ►పోలీసుల మోహరింపు ►ఐదుగురి అరెస్టు కేకేనగర్: చెన్నై ఎంజీఆర్ నగర్లో నివసిస్తున్న ఓపీఎస్ వర్గ నిర్వాహకుడిని 2వ అంతస్తు నుంచి కిందకు లాక్కొచ్చి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంఘటన ఆ ప్రాంతంలో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హత్యకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంజీఆర్ నగర్ సూలై పల్లం అన్నా వీధికి చెందిన కుమార్ అలియాస్ చిన్నకుమార్ (39). ఇతడు అన్నాడీఎంకేలో 137వ వార్డు అన్నాడీఎంకే సహాయ కార్యదర్శిగా పదవి వహించాడు. జయలలిత మృతి తర్వాత జె. దీపా వర్గంలో కుమార్ చేరారు. శశికళ నుంచి ఓపీఎస్ విడిపోయిన తర్వాత ఓ పన్నీర్ సెల్వంకు సన్నిహిత మద్దతుదారుడిగా మారాడు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆదివారం రాత్రి 11 గంటలకు కుమార్ తన ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో ఐదుగురు అతని ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో చిన్నకుమార్పై దాడి జరిపారు. రెండవ అంతస్తు నుంచి అతడిని బరబరా లాక్కొని వచ్చి ఇంటి ముందు నిలబెట్టి దారుణంగా నరికారు. రక్తం మడుగులో పడి ఉన్న కుమార్ మృతి చెందాడని వారు పారిపోయారు. ప్రాణాలతో పోరాడుతున్న అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎంజీఆర్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో చిన్నకుమార్, అతని మిత్రుడు శ్రీనివాసన్ అను అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపార పోటీలో ఏర్పడిన పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ హత్యకు సంబంధించి చెన్నై సమీపంలో గూడువాంజేరికి చెందిన శ్రీనివాసన్ (40), మణి (20), మది (20), రోజా (22), బాలకృష్ణన్లను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
ప్రధాని మోదీకి పన్నీరు సెల్వం లేఖ
చెన్నై: తమిళనాట ప్రసిద్ధి చెందిన జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు సంప్రదాయ క్రీడాగా భావించే జల్లికట్టును సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించుకునేందుకు చట్టపరమైన ఇబ్బందులను తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా వారం రోజులు పాటు నిర్వహించే జల్లికట్టుకు చాలా విశిష్ఠత ఉందని పన్నీరు సెల్వం తెలిపారు. చట్ట పరమైన ఇబ్బందులను తొలగించాలని, ఇందుకు తమ వంతు కృషి చేయాలని మోదీని కోరారు. గతంలో జల్లికట్టు ప్రదర్శనకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. 2014లో సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధించిన విషయం అందరికి తెలిసిందే. తమిళనాడులో అధికార అన్నా డీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా అన్ని పార్టీలు జల్లికట్టు పై ఆంక్షలు ఎత్తివేయాలని కోరడం గమనార్హం.