విజయ్-హజారే ట్రోఫీని తొలిసారి గెలిచి హిమాచల్ ప్రదేశ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే హిమాచల్ ప్రదేశ్ అద్భుత విజయంలో ఆ జట్టు కెప్టెన్ రిషి ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్‌లో బ్యాట్‌తోను, బాల్‌తోను అద్భుతంగా రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు సాధించాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో 458 పరుగులతో రెండో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో రానున్న ఐపీఎల్ మెగా వేలంలో అతడిని దక్కించకోనేందుకు చాలా జట్లు పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మూడు జట్లు అతడిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్-2022 వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలంజ్సర్ బెంగళూరు జట్లు అతడి కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2022 వేలానికి ముందు కెప్టెన్ రిషబ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, అన్రిచ్ నార్జేను రీటైన్ చేసుకుంది. కాగా సరైన ఆల్ రౌండర్ జట్టులో లేకపోవడంతో రిషి ధావన్‌పై డిసీ కన్నేసినట్లు సమాచారం. అతడి కోసం ఎంత మొత్తం అయినా వెచ్చించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment