Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. శుబ్‌మన్ గిల్(49 బంతుల్లో 67, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ విజయంలో గిల్ కీలకపాత్ర పోషించాడు.
ఇక మ్యాచ్ విజయం అనంతరం గిల్ మాట్లాడుతూ.. ''ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. పాత బంతితో సిక్సర్లు కొట్టడం అంత తేలికైన విషయం కాదు. అందునా ఇది చాలా పెద్ద గ్రౌండ్. గ్యాప్ చూసి పరుగులు చేయడం కష్టంగా అనిపించింది. మ్యాచ్ నేనే ఫినిష్ చేయాలనుకున్నాకానీ కుదరలేదు.
పంజాబ్ కింగ్స్‌తో ఉన్న అనుబంధం అనుకుంటా తెవాటియాకు మ్యాచ్ గెలిపించాలని రాసిపెట్టి ఉంది. ఇక ఇలాంటి మ్యాచ్‌ల్లో ఇరుజట్లపై ఒత్తిడి ఉంటుంది. చేధించాల్సింది పెద్ద స్కోరు కానప్పటికి పిచ్ కాస్త కఠినంగా ఉంది. ఇక మోహిత్ శర్మ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన యార్కర్ డెలివరీలతో పంజాబ్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. నిజంగా గుజరాత్ తరపున మోహిత్‌కు ఇది గొప్ప డెబ్యూట్‌గా నిలిచిపోనుంది'' అని చెప్పుకొచ్చాడు.
WHAT A SHOT, SHUBMAN GILL 🔥pic.twitter.com/8oPJcUZfAQ
— Johns. (@CricCrazyJohns) April 13, 2023
Comments
Please login to add a commentAdd a comment