లివింగ్‌స్టోన్ విధ్వంసం.. ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌.. వైరల్‌ | Liam Livingstone Hits Mohammed Shami for 117 metre six | Sakshi
Sakshi News home page

IPL 2022: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌.. వైరల్‌

Published Wed, May 4 2022 8:46 AM | Last Updated on Wed, May 4 2022 12:18 PM

Liam Livingstone Hits Mohammed Shami for 117 metre six - Sakshi

లియామ్ లివింగ్‌స్టోన్(PC: IPL/BCCI)

IPL 2022 PBKS Vs GT: ఐపీఎల్‌-2022లో భాగంగా మంగళవారం(మే 3) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ఈ సీజన్‌లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి లివింగ్‌స్టోన్ చుక్కలు చూపించాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది లివింగ్‌స్టోన్  ఏకంగా 28 పరుగులు రాబట్టాడు.

ఈ ఓవర్‌లోనే తొలి బంతికి  లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా లివింగ్‌స్టోన్ నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో 10 బంతుల్లోనే లివింగ్‌స్టోన్ 30 పరుగులు సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రేవిస్‌ 112 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

చదవండిECS T20 League: 'నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం'.. అంటే ఇదేనేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement