ఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. రాహుల్ తెవాటియా అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ షేక్ హాండ్ ఇచ్చేందుకు వచ్చినప్పుడు రాహుల్ వాగ్వాదానికి దిగాడు. వార్నర్‌తో కోపంగా ఏదో మాట్లాడాడు.
— faceplatter49 (@faceplatter49) October 11, 2020
ఇంతకి ఎందుకా కోపం...
లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఆఖరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు చేయాల్సి ఉంది. ఖలీల్ అహ్మద్ చివరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. మొదట్లో రాహుల్, ఖలీల్ మధ్య ఏదో సంభాషణ జరిగింది. ఐదో బంతికి రియాన్ పరాగ్ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అప్పుడే వారి మధ్య వాగ్వాదం పెరిగింది. మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ వచ్చి రాహుల్‌కు సర్దిచెప్పాడు. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన ఖలీల్‌పై మళ్లీ ఫైర్ అయ్యాడు. చివరకు మిగతా జట్టు సభ్యులు వచ్చి సర్దిచెప్పడంతో రాహుల్ శాంతించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. హైదరాబాద్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 75 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక ఓటమి తప్పదని అనుకున్న సమయంలో రాహుల్ తెవాటియా 45 (28), రియాన్ పరాగ్ 42 (26) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
(ఇదీ చదవండి: సిక్సర్ల తెవాటియాకు కోహ్లి కానుక)
Comments
Please login to add a commentAdd a comment