రాజస్తాన్ రాయల్స్ టీంకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తాజా గెలుపుతో ప్రత్యర్థి టీంపై ప్రతీకారం సాధించింది. ఈ నెల 11న ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలవగా.. ఆర్‌ఆర్ టీం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ‘‘హేయ్ జొమాటో! మేము ఓ పే...ద్ద హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేయాలనుకుంటున్నాము. లొకేషన్ : రాయల్ మిరాజ్ మాత్రమే’’ అంటూ వ్యంగ్యంగా స్పందించింది. ‘వరల్డ్ బిర్యానీ డే’ హ్యాష్ ట్యాగ్‌ను జతచేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. కౌంటర్ ఇవ్వటానికి వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఎస్‌ఆర్‌హెచ్ టీం శుక్రవారం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ‘‘బిర్యానీ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయండి.. దాని కారాన్ని మిత్రులు తట్టుకోలేరు. వాళ్లకు దాల్ బాటీ చాలు’’ అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ( ‘మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది’)
కాగా, గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఈ రెండు టీం మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిందిన సంగతి తెలిసిందే.
Cancel the biryani order our friends can't handle the level of spice 🙂
— SunRisers Hyderabad (@SunRisers) October 22, 2020
P.S. : Daal baati should just do fine.#RRvSRH #KeepRising #OrangeArmy #Dream11IPL https://t.co/CLvZ1VhJkN
Comments
Please login to add a commentAdd a comment