అతనికి చాన్స్‌ ఇస్తే కరోనా వ్యాక్సిన్‌ కూడా..: సెహ్వాగ్‌ | Sehwags Amazing Tweet After Tewatias Stunning Catch | Sakshi
Sakshi News home page

అతనికి చాన్స్‌ ఇస్తే కరోనా వ్యాక్సిన్‌ కూడా..: సెహ్వాగ్‌

Published Sun, Oct 18 2020 12:04 AM | Last Updated on Sun, Oct 18 2020 9:42 PM

Sehwags Amazing Tweet After Tewatias Stunning Catch - Sakshi

దుబాయ్‌: రాజస్తాన్‌ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనికి అవకాశమిస్తే కరోనా వ్యాక్సిన్‌ను కూడా తయారు చేయగలడని తనదైన శైలిలో కొనియాడాడు. ఇప్పటికే తన సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు సంచలన విజయాలందించిన తెవాటియా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కూడా అదరగొట్టాడు.ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఓడిపోయినా తెవాటియా పెర్ఫార్మెన్స్‌ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్ వచ్చిన తెవాటియా (19 నాటౌట్‌; 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం బౌలింగ్‌లో పడిక్కల్ వికెట్ తీశాడు. ఇక అంతటితో ఆగకుండా బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్‌తో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి(43)ని పెవిలియన్ చేర్చాడు.

కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా విరాట్ భారీ షాట్ ఆడగా.. బంతి దాదాపు సిక్స్‌గా వెళ్లింది. కానీ ఆ దిశలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తెవాటియా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే పట్టుతప్పుతున్నట్లు గ్రహించిన ఈ రాజస్తాన్ ఆల్‌రౌండర్.. బంతిని గాల్లోకి ఎగిరేసి మళ్లీ వచ్చి చాకచక్యంగా అందుకున్నాడు. ఇక ఈ క్యాచ్‌కు ఫిదా అయిన సెహ్వాగ్.. రాహుల్ తెవాటియాను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ఈ సీజన్‌లో అతను పట్టిందల్లా బంగారమే అవుతుందనే అర్థంలో తనదైన శైలిలో ప్రశంసించాడు. ‘తెవాటియా ఏదైనా చేయగలడు. ఆఖరికి తనకు అవకాశం ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేయగలడు. అద్భుతమైన క్యాచ్'అంటూ సెహ్వాగ్ హిందీలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో తెవాటియా సూపర్ క్యాచ్ ఫొటోను కూడా సెహ్వాగ్‌ పంచుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement