న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరడంలో తాను ఇచ్చిన ఉచిత సలహా కూడా ఉపయోగపడిందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు.మార్కస్ స్టోయినిస్‌ను ఓపెనర్‌గా పంపమని తాను ఒక సలహా ఇస్తే, అది ఢిల్లీకి అడ్వాంటేజ్ అయ్యిందన్నాడు. ఈ మేరకు ఒక వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్-2 గురించి సెహ్వాగ్ మాట్లాడాడు. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయడం సరైన నిర్ణయంగా పేర్కొన్నాడు. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ ఛేజింగ్ చేస్తూ తడబడిన విషయాన్ని ప్రస్తావించిన సెహ్వాగ్.. క్వాలిఫయర్-2లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌కు మొగ్గుచూపడం వంద శాతం మంచి నిర్ణయమేనన్నాడు.‘ ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది.
కానీ ఇక్కడ ఆ జట్టు తీసుకున్న ఒక నిర్ణయంతో ఆశ్చర్యపోయా.స్టోయినిస్‌ను ఓపెనింగ్‌కు పంపమని నేను చెప్పా. అలాగే చేశారు. అది నేను ఇచ్చిన సలహానే కానీ ఉపయోగపడింది’ అని సెహ్వాగ్ తెలిపాడు. ఇక స్టోయినిస్ ఆరంభంలోనే ఇచ్చిన క్యాచ్‌ను సన్‌రైజర్స్ ఆటగాడు హోల్డర్ వదిలేయడంతో ఒక గొప్ప చాన్స్‌ను కోల్పోయిందన్నాడు. ఆ సమయంలో స్టోయినిస్ మూడు పరుగులే చేశాడని ,అప్పుడు అతని క్యాచ్ తీసుకుని ఉంటే ఢిల్లీపై ఒత్తిడి వచ్చేదన్నాడు. ఆ తర్వాత స్టోయినిస్ విలువైన పరుగుల్ని సాధించి ఢిల్లీ మంచి ఆరంభంలో కీలక పాత్ర పోషించాడన్నాడు. ఢిల్లీ 8 ఓవర్లు చేరేసరికి 80 పరుగులు దాటేసిందని, ఆ ఫుల్‌స్పీడ్‌నే తుది వరకూ కొనసాగించిందన్నాడు. రషీద్ ఖాన్ తన రెండో ఓవర్‌లో స్టోయినిస్‌ను బౌల్డ్ చేసినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయిందన్నాడు. స్టోయినిస్ అయ్యే సమయానికి ధావన్ డ్రైవర్ సీట్(పైచేయి సాధించడంలో)లో కూర్చోవడంతో ఢిల్లీలో పరుగులు వేగం తగ్గలేదన్నాడు. ఈ మ్యాచ్‌లో స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 38 పరుగులు సాధించడంతో పాటు మూడు కీలక వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment