IPL 2022 GT vs PBKS: Tewatia Incredible Sixes Winning Knock Wife Pic Viral - Sakshi
Sakshi News home page

IPL 2022: తెవాటియా సిక్సర్‌ కొట్టగానే ఎగిరి గంతేసిన అమ్మాయి.. ఇంతకీ ఎవరామె?!

Published Sat, Apr 9 2022 1:07 PM | Last Updated on Sat, Apr 9 2022 2:54 PM

IPL 2022 GT Vs PBKS: Tewatia Incredible Sixes Winning Knock Wife Pic Viral - Sakshi

రాహుల్‌ తెవాటియా(PC: IPL/BCCI)

తమదైన రంగంలో జీవిత భాగస్వామి రాణిస్తే... సదరు భర్త లేదంటే భార్య పొందే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. వాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కితే సంతోషంతో కళ్లు చెమర్చడం సహజం. గుజరాత్‌ టైటాన్స్‌ క్రికెటర్‌ రాహుల్‌ తెవాటియా సతీమణి రిద్ధి పన్ను ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. చేజారిందనుకున్న మ్యాచ్‌ను ఆఖరి నిమిషంలో వరుస షాట్లు బాది తన భర్త జట్టును గెలిపించిన తీరు చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

ఆనందంతో చిన్నగా స్టెప్పులేస్తూ తన బెస్టాఫ్‌ను చూస్తూ మురిసిపోయారు. ఐపీఎల్‌-2022 సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చివరి వరకు నువ్వా- నేనా అంటూ సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతుల్లో గుజరాత్‌ విజయానికి 12 పరుగులు అవసరమైన తరుణంలో తెవాటియా బ్యాట్‌ ఝులిపించాడు.

ఓడియన్‌ స్మిత్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొంది.. అరంగేట్ర సీజన్‌లో హార్దిక్‌ పాండ్యా సేన హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఇక నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో తెవాటియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ప్రేక్షకులతో పాటు అతడి భార్య రిద్ధి కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు. 

తన భర్త ఈ ఫీట్‌ పూర్తి చేస్తాడా లేదా అన్న కంగారు ఆమె ముఖంలో కనిపించింది. అయితే, వరుస షాట్లతో తెవాటియా విరుచుకుపడటంతో రిద్ధి ఆనందంలో ముగినిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ... భర్త విజయాన్ని ఆస్వాదిస్తూ ఎగిరి గంతేశారు. ఈ క్రమంలో వైట్‌ టాప్‌లో తళుక్కుమన్న రిద్ధిపై కెమెరాలు దృష్టి సారించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

కాగా దేశవాళీ క్రికెట్‌లో హర్యానా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్‌ తెవాటియా గతంలో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ అతడిని కొనుగోలు చేసింది. ఇక గతేడాది ఫిబ్రవరిలో రిద్ధితో నిశ్చితార్థం చేసుకున్న తెవాటియా.. నవంబరులో ఆమెను వివాహమాడాడు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లి వేడుకకు నితీశ్‌ రాణా, రిషభ్‌ పంత్‌, యజువేంద్ర చహల్‌ తదితర టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు.

చదవండి: Who Is Sai Sudharsan: ఎవరీ సాయి సుదర్శన్‌? ధర కేవలం 20 లక్షలే.. అయినా గానీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement