గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం తన సోషల్ మీడియా ఖాతాలో వివాదాస్పద కథనం పోస్టు చేశాడు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట్ ఉండడంతో యశ్ దయాల్ వెంటనే పోస్టు డిలీట్ చేశాడు.
విషయంలోకి వెళితే.. లవ్ జిహాద్‌కు సంబంధించిన ఓ కార్టూన్ చిత్రాన్ని యశ్ దయాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. యువతి కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా ఓ వ్యక్తి తన వీపు వెనుక చాకును దాచి పెట్టుకుని ఆమెకు ప్రపొజ్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ పక్కనే సమాధులు ఉండగా మరో మహిళ మృతదేహం ఉంది. ఆ మృతదేహం పై సాక్షి అని పేరు రాసి ఉంది.
కానీ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను కావాలని ఆ పోస్ట్ ను చేయలేదని పొరబాటు జరిగినట్లు ఒప్పుకుంటూ తన తప్పును క్షమించాలంటూ పోస్ట్ పెట్టాడు. ''పొరబాటున ఆ కథనాన్ని పోస్ట్ చేశాను దయచేసి క్షమించండి ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దు. థ్యాంక్యూ.. సొసైటీలోని ప్రతి సంఘం, కమ్యూనిటీ పట్ల నాకు గౌరవం ఉంది.'' అంటూ రాసుకొచ్చాడు.
ఐపీఎల్‌లో యశ్ దయాల్ పేలవ ప్రదర్శన చేశాడు. ఒక మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్‌లో యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. ఈ దెబ్బతో మానసికంగా ఒత్తిడికి గురైన యష్ దయాల్.. ఫైనల్‌కు ముందు బరిలోకి దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment