భారత బౌలర్ యశ్ దయాళ్‌కు బంపరాఫర్ వచ్చింది. ఆస్ట్రేలియాతో టెస్టుల నేపథ్యంలో అతడు రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుతో చేరినట్లు సమాచారం. ఖలీల్ అహ్మద్ స్థానంలో యశ్ దయాళ్ టీమిండియాతో కలిసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు సౌతాఫ్రికా నుంచి నేరుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభం కానుంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో.. పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించనున్నాడు.
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టులకు ప్రకటించిన ప్రధాన జట్టులో ఆంధ్ర క్రికెటర్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు పేసర్ హర్షిత్ రాణా కూడా ఈ సిరీస్‌కు ఎంపిక కాగా.. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
పేస్ ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా
మరోవైపు.. పేస్ ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్‌లను కూడా బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది.
అయితే, ప్రాక్టీస్ సమయంలో.. ఖలీల్ అహ్మద్ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ ఈ లెఫ్టార్మ్ పేసర్ గాయపడగా.. పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం అతడిని స్వదేశానికి వెళ్లాల్సిందిగా సూచించినట్లు సమాచారం.
ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా యశ్ దయాళ్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ ఆస్ట్రేలియాకు పిలిపించినట్లు వార్తా సంస్థ పీటీఐకి బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘‘నిజానికి యశ్ దయాళ్ మొదటి నుంచే జట్టుతో ఉండాల్సింది. భారత్-‘ఎ’తో మ్యాచ్ ఆడాల్సింది. కానీ అతడిని టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాకు పంపించాం.
అందుకే యశ్ దయాళ్‌ను పిలిపించాం
ఒకవేళ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేయలేకపోతే అతడు జట్టుతో ఉండీ ప్రయోజనం లేదు. అందుకే యశ్ దయాళ్‌ను పిలిపించాం’’అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే ప్రధాన బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు స్టార్ ఓపెనర్ యశ్ దయాళ్ భుజానికి గాయమైనా.. బుధవారం అతడు తిరిగి బ్యాట్ పట్టడం సానుకూలాంశం.
ఇక యశ్ దయాళ్‌కు.. గతంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా సెలక్టర్లు పిలుపునిచ్చారు. కానీ తుదిజట్టులో అతడికి స్థానం దక్కలేదు. సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికైనా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఉత్తరప్రదేశ్ లెఫ్టార్మ్ సీమర్‌ను ఆర్సీబీ.. ఈసారి రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పుడిలా మరోసారి టీమిండియాతో కలిసే లక్కీ ఛాన్స్ యశ్ దయాళ్‌కు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment