Photo: IPL Twitter
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్‌కు ఈరోజు ఒక పీడకలగా మిగిలిపోనుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రింకూ సింగ్ యష్ దయాల్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన యష్ దయాల్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సహా మొత్తం 31 పరుగులు సమర్పించుకున్నాడు.
Photo: IPL Twitter
ఓవరాల్‌గా 4 ఓవర్లు వేసి 69 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఈ క్రమంలోనే యష్ దయాల్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో యష్ దయాల్ రెండో స్థానంలో నిలిచాడు.
తొలి స్థానంలో బాసిల్ థంపి(4 ఓవర్లలో 70 పరుగులు, 2018లో ఆర్సీబీతో మ్యాచ్‌లో) ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఇషాంత్ శర్మ( 2013లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 66 పరుగులు), ముజీబ్ ఉర్ రెహమాన్(2019లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 66 పరుగులు), ఉమేశ్ యాదవ్( 2013లో ఆర్సీబీతో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 65 పరుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: #RinkuSingh: ఊహించని మలుపులు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వేళ
Got up from the seat and shouted when this happened
— Albert Einstein Jr (@iEinsteinJr) April 9, 2023
Unbelievable chase by #RinkuSingh 🔥
Bad luck #yashdayal #KKRvGT pic.twitter.com/I5OLsHFd00
Comments
Please login to add a commentAdd a comment