బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది. ఈ సిరీస్‌తో భారత డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ జట్టులో పంత్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు కొనసాగించారు. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సైతం తిరిగొచ్చాడు.
యశ్‌దయాల్ ఎంట్రీ..
అయితే ఎవరూ ఊహించని విధంగా యువ పేసర్ యశ్ దయాల్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. అందరూ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కుతుందని భావించంగా.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ దయాల్ వైపు మొగ్గు చూపింది.
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అతడు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లతో భారత జట్టు తరపున బంతిని పంచుకునే అవకాశముంది.
జోరో టూ హీరో..
ఇక యశ్ దయాల్ క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. ఐపీఎల్-2023 సీజన్ సగటు క్రికెట్ అభిమానికి గుర్తిండే ఉంటుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసానికి దయాల్ బలైపోయాడు.
దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు సంచలనం విజయం అందించిన సీజన్ ఇది. గతేడాది సీజన్‌లో దయాల్‌కు రింకూ కాలరాత్రిని మిగిల్చాడు.
వరుసగా 5 సిక్స్‌లు సమర్పించుకున్న దయాల్.. విమర్శలకు కేంద్రంగా నిలిచాడు. రింకూ దెబ్బకు అతడు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో సీజన్ మధ్యలోనే అతడు వైదొలిగాడు.
అయితే ఆ రోజు అతడు కాస్త వెనకడుగు వేసిన దయాల్.. పడిలేచిన కేరటంలా తిరిగి వస్తాడని ఎవరూ ఊహించలేదు. ఆ రోజును పీడకలలా మర్చిపోయిన యశ్.. ఇప్పుడు సంచలన ప్రదర్శనలు కనబరుస్తూ ఏకంగా భారత జట్టులోఎంట్రీ ఇచ్చాడు. అతడి పట్టుదల పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురిస్తోంది.
2018లో గుజరాత్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన దయాల్.. ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా-ఎకు అతడు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. ఇండియా-బితో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కూడా దయాల్ పర్వాలేదన్పించాడు. ఆర్సీబీ తరపున 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment