యశ్ దయాల్ (PC: KKR Twitter)
IPL 2023- GT Vs KKR: ‘‘తలెత్తుకో.. ఒక్కోసారి అత్యుత్తమ క్రికెటర్ల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నీది కాదంతే! నువ్వు ఎల్లప్పుడూ చాంపియన్‌వే యశ్. ఇంతకంటే గొప్పగా.. మరింత వేగంగా పుంజుకుని నువ్వేంటో నిరూపించుకుంటావు’’ అంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ క్రీడాస్ఫూర్తిని చాటుకుంది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్‌ను ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్ చేసింది. అతడికి అండగా నిలిచి నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
అదరగొట్టిన అయ్యర్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలో తడబడ్డా.. వెంకటేశ్ అయ్యర్(83), నితీశ్ రాణా(45) రాణించి గెలుపుపై ఆశలు చిగురింపజేశారు.
5 సిక్సర్లతో దుమ్ములేపిన రింకూ
ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కు మర్చిపోలేని విజయం అందించాడు. కాగా రింకూ ఊచకోతకు బలైపోయిన బౌలరే యశ్ దయాల్.
రింకూ, యశ్ ఒకే జట్టుకు ఆడతారు!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశ్ లెఫ్టార్మ్ మీడియం పేసర్. దేశవాళీ క్రికెట్లో రింకూతో కలిసి ఆడాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశ్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు పూర్తి చేసి ఏకంగా 69 పరుగులు సమర్పించుకున్నాడు.
కేకేఆర్ ట్వీట్ వైరల్
ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఏకంగా 31 పరుగులు ఇచ్చి తమ జట్టు ఓటమి కారణమయ్యాడు. దీంతో ముఖం చేతుల్లో దాచుకుంటూ యశ్ దయాల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో కేకేఆర్ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న యశ్‌ను ఉద్దేశించి చాంపియన్ అంటూ ట్వీట్ చేసింది. బాధ పడొద్దంటూ ధైర్యం చెప్పింది. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఎవరీ యశ్ దయాల్?
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1997 డిసెంబరు 13న యశ్ దయాల్ జన్మించాడు. 2018లో యూపీ తరఫున లిస్ట్ ఏక క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 17 ఫస్ట్‌క్లాస్, 14 లిస్ట్ ఏ మ్యాచ్. 33 టీ20లు ఆడిన యశ్ దయాల్ మూడు ఫార్మాట్లలో వరుసగా 58, 23, 29 వికెట్లు తీశాడు.
దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ఈ పేస్ బౌలర్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 వేలంలో 3.2 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు టైటాన్స్ తరఫున యశ్ దయాల్ 9 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌కు ఎంపికైన యశ్.. దురదృష్టవశాత్తూ.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
చదవండి: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. అయితే: మార్కరమ్
IPL 2023: అవును.. బిగ్ ప్లేయర్.. కానీ పాపం నువ్వే బలైపోయావు!
Chin up, lad. Just a hard day at the office, happens to the best of players in cricket. You’re a champion, Yash, and you’re gonna come back strong 💜🫂@gujarat_titans pic.twitter.com/M0aOQEtlsx
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2023
𝗗𝗲𝘁𝗲𝗿𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻, 𝗘𝘅𝗰𝗲𝗹𝗹𝗲𝗻𝗰𝗲, 𝗖𝗹𝗮𝘀𝘀: All captured in a moment to savour 🙌
— IndianPremierLeague (@IPL) April 10, 2023
Seek your Monday Motivation from this conversation ft. man of the moment @rinkusingh235 & @NitishRana_27 👏👏 - By @Moulinparikh
Full Interview🔽 #TATAIPLhttps://t.co/X0FyKmIjAD pic.twitter.com/FtVgYQJQ5H
Comments
Please login to add a commentAdd a comment