Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుందిగా. ఒక్క ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది రింకూ సింగ్ కేకేఆర్‌కు సంచలన విజయం అందించాడు. కానీ ఆ ఓవర్ వేసిన గుజరాత్ బౌలర్ యష్ దయాల్‌కు మాత్రం అది ఒక పీడకలగా మిగిలిపోయింది. ఒక ఓవర్ ఒకరిని హీరో చేస్తే.. మరొకరిని జీరో చేసింది.
ఒక్కో ఓవర్‌తో యష్ జీవితం తలకిందులు
రింకూ సింగ్ దెబ్బకు యష్ దయాల్ ఈ సీజన్‌లో మరొక మ్యాచ్ ఆడలేకపోయాడు. అందుకు వేరే కారణం కూడా ఉంది. ఆ ఒక్క ఓవర్ యష్ దయాల్ జీవితాన్ని తలకిందులు చేసింది. తనవల్లే గుజరాత్ ఓడిందని మానసికంగా బాగా దెబ్బతిన్న యష్‌దయాల్ అనారోగ్యం బారిన పడ్డాడు.
దాదాపు ఏడు నుంచి ఎనిమిది కిలలో బరువు తగ్గిన యష్ దయాల్ వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌పై విజయం అనంతరం మాట్లాడిన పాండ్యా యష్ దయాల్ పరిస్థితిని వివరించాడు.
Photo: IPL Twitter
మళ్లీ ఆడతాడో లేదో!
"ఈ సీజన్ లో అతడు మళ్లీ ఆడతాడో లేదో చెప్పలేను. ఆ మ్యాచ్ తర్వాత అతడు అనారోగ్యానికి గురయ్యాడు. 7-8 కిలోల బరువు తగ్గాడు. ఆ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ఇక అదే సమయంలో అతడు ఎదుర్కొన్న ఒత్తిడి కారణంగా ప్రస్తుతం అతడు బరిలోకి దిగే పరిస్థితి కూడా లేదు. అతన్ని మళ్లీ ఫీల్డ్ లో చూడటానికి చాలా సమయమే పడుతుంది" అని హార్దిక్ పేర్కొన్నాడు.
ఇక ఒక్క మ్యాచ్ కాదు ఒక్క ఓవర్‌తో యశ్ దయాల్ కెరీర్ తలకిందులైంది. జట్టు అతనికి అండగా నిలిచిందని సహచర ప్లేయర్స్ చెబుతున్నా.. దాని తాలూకు షాక్ నుంచి యశ్ ఇప్పటికీ కోలుకోలేకపోయాడని అర్థమవుతోంది. అటు యశ్ దయాల్ కుటుంబం కూడా చాలా బాధపడ్డారు. ఏది ఏమైనా యష్ దయాల్ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుందాం.
Hardik Pandya revealed big news about Yash Dayal.#HardikPandya #YashDayal #GujaratTitans #News #Cricketfans #GTvsKKR #RinkuSingh #NewsUpdate #CricketTwitter #IPL #IPL2023 pic.twitter.com/rCqQu7oGcT
— CricInformer (@CricInformer) April 26, 2023
చదవండి: Yash Dayal: అత్యంత చెత్త రికార్డు.. పాపం మొహం చూపించలేక
అదో కాలరాత్రి, అతని తల్లి అన్నం ముట్టట్లేదు.. యశ్ దయాల్ తండ్రి ఆవేదన
'అర్జున్‌ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!'
Comments
Please login to add a commentAdd a comment