
గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ బౌలింగ్ కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి 5 బంతులను సిక్సర్లుగా మలిచి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం జరిగిన మూడు రోజులు గడిచిపోయాయి. ఆతర్వాత మరో రెండు మ్యాచ్‌లు కూడా ఓ రేంజ్‌లో సాగాయి. రింకూ సింగ్-యశ్ దయాల్ ఉదంతాన్ని దాదాపుగా అందరూ మరిచిపోయారు. క్రికెట్‌లో ఇవన్నీ సర్వ సాధారణమేనని అందరూ సర్దుకుపోయారు.
"Because he's the Knight #KKR deserves and the one they need right now" - Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX
— JioCinema (@JioCinema) April 9, 2023
అయితే బాధిత బౌలర్ (యశ్ దయాల్) తల్లి రాధా దయాల్ మాత్రం ఆ ఉదంతాన్నే తలచుకుంటూ ఇప్పటికీ కన్నీరుమున్నీరవుతూ అన్నం తినట్లేదట. కుటుంబ సభ్యులందరూ ఆమెను ఎంత ఓదార్చాలని ప్రయత్నించినా ఆమె ఏడుపు ఆగట్లేదట. ఆ ఉదంతం జరిగి మూడు రోజులు గడుస్తున్నా రాధా దయాల్ అదే తలుచుకుంటూ ఆవేదన చెందుతుందట. తన కొడుకుకు కెరీర్ ఆరంభంలో ఇలాంటి అనుభవం (5 సిక్సర్లు) ఎదురుకావడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుందట.
ఈ విషయాన్ని యశ్ దయాల్ తండ్రి చంద్రపాల్ దయాల్ మీడియాకు వివరించాడు. కొడుకు ఎదుర్కొన్న అనుభవాన్ని తలుచుకుంటూ చంద్రపాల్ యాదవ్ సైతం ఆవేదన వ్యక్తం చేశాడు. అదో కాలరాత్రి, మా జీవితంలో ఎప్పటికీ దాన్ని మరువలేమని తెలిపాడు. క్రికెట్‌లో ఇలాంటి అనుభవాలు సాధారణమే అయినప్పటికీ, మనవరకు వచ్చే సరికి దాన్ని అంత ఈజీగా తీసుకోలేమని అన్నాడు.
ఇలాంటి క్లిష్ట సమయంలో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, జట్టు సహచరులు తమ కుమారుడికి అండగా నిలిచి, అతనిలో ధైర్యం నింపారని చంద్రపాల్ దయాల్ మీడియాకు తెలిపాడు. దయాల్‌ను ఆ మూడ్‌లో నుంచి బయటకు తెచ్చేందుకు జీటీ మేనేజ్‌మెంట్ పాటలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నాడు.
కాగా, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపుకు చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరం కాగా, యశ్ దయాల్ బౌలింగ్‌లో రింకూ సింగ్ ఆఖరి 5 బంతులను సిక్సర్లుగా మలిచి, తన జట్టుకు చారిత్రక విజయాన్ని, బౌలర్ యశ్ దయాల్‌కు చిరకాలం గుర్తుండిపోయే విషాదాన్ని మిగిల్చాడు.