MI: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై?.. రోహిత్‌ శర్మ కామెంట్స్‌ వైరల్‌ | Last Hai Ye: Rohit Sharma Viral Chat With Abhishek Nayar Goes Viral | Sakshi
Sakshi News home page

Rohit Sharma: అది నా ఇల్లు.. కానీ ఇదే లాస్ట్‌: రోహిత్‌ శర్మ కామెంట్స్‌ వైరల్‌

Published Sat, May 11 2024 9:21 AM | Last Updated on Sat, May 11 2024 4:32 PM

కేకేఆర్‌ కోచ్‌తో రోహిత్‌ శర్మ (PC: X)

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా? వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా? హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో తనకు జరిగిన అవమానం పట్ల ఆవేదన చెందుతున్నాడా?

తాను నిర్మించిన సామ్రాజ్యం నుంచి తానే బయటకు వెళ్లే సమయం వచ్చిందా? అంటే అవుననే మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్‌ శర్మ- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ మధ్య జరిగిన తాజా ‘సంభాషణ’కు సంబంధించిన దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఐపీఎల్‌-2024 కంటే ముందే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మపై వేటు వేసిన ముంబై ఫ్రాంఛైజీ.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. 

అపఖ్యాతి
అయితే, అతడి సారథ్యంలో పేలవ ప్రదర్శనతో చతికిల పడిన ముంబై ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. రోహిత్‌, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు‌ వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

అదే విధంగా.. పాండ్యా వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్న రోహిత్‌ వచ్చే ఏడాది ముంబై జట్టును వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబై శనివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ సన్నాహకాల్లో భాగంగా మైదానంలోకి వెళ్లిన రోహిత్‌- కేకేఆర్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడినట్లుగా ఉన్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

అది నా ఇల్లు బ్రదర్‌
ఇందులో.. ‘‘ఒక దాని తర్వాత మరొకటి మారిపోతూ ఉన్నాయి. వాళ్లే ఇందుకు కారణం. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్‌.. నేను నిర్మించిన గుడి అది. ఇదే నాకు లాస్ట్‌’’ అంటూ రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి రోహిత్‌ ముంబై ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని అనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ తదుపరి కేకేఆర్‌లో చేరితే బాగుంటుందంటూ పాకిస్తాన్‌ లెజెండరీ పేసర్‌, గతంలో కోల్‌కతా ఫ్రాంఛైజీతో పనిచేసిన వసీం అక్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్‌ నాయర్‌తో హిట్‌మ్యాన్‌ సంభాషణ మరింత హైలైట్‌ అవుతోంది.

చదవండి: KL Rahul- Sanjeev Goenka: జట్టు గెలవాలన్న తపనే అది: బ్రెట్‌ లీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement