
ముంబై: భారత వన్డే జట్టు మాజీ సభ్యుడు, ముంబై క్రికెటర్ అభిషేక్ నాయర్ అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని బుధవారం ప్రకటించాడు. 1983లో సికింద్రాబాద్‌లో జన్మించిన 36 ఏళ్ల నాయర్ 2009లో భారత్ తరఫున మూడు వన్డేల్లో పాల్గొన్నాడు. రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... మూడో మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చిన అతను ఏడు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు.
ముంబై తరఫున 103 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నాయర్ 5,749 పరుగులు చేసి, 173 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో నాయర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, పుణే వారియర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల తరఫున ఆడాడు.