పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ సహనం కోల్పోయాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ల నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. సొంతగడ్డపై టాస్ ఓడిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓవర్ త్రో.. ఓ సింగిల్
అయితే, కేకేఆర్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ సందర్భంగా గౌతం గంభీర్ తీవ్ర అసహానికి గురయ్యాడు. పద్నాలుగో ఓవర్‌లో పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చహర్ ఆఖరి బంతిని అవుట్ సైడాఫ్ దిశగా షార్ట్‌బాల్‌గా సంధించాడు. అప్పుడు క్రీజులో ఉన్న ఆండ్రీ రసెల్ ఆ బంతిని కవర్స్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఫీల్డర్ అశుతోష్ శర్మ ఇన్‌సైడ్ సర్కిల్‌లోనే బంతిని ఆపేసి.. వికెట్ కీపర్ జితేశ్ శర్మ వైపునకు విసిరాడు. అయితే, అది ఓవర్ త్రో అయింది. దీంతో మరో ఎండ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్‌ను పిలిచి రసెల్ సింగిల్ తీశాడు.
పరుగు ఇవ్వడం కుదరదు
కానీ ఆన్ ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి ఈ సింగిల్‌ను పరుగుల ఖాతాలో చేర్చేందుకు నిరాకరించాడు. అశుతోశ్ బంతిని ఆపేసిన తర్వాత.. తాను తాను ఓవర్ పూర్తైందని కాల్ ఇచ్చానని.. కాబట్టి ఈ ఓవర్ త్రో కారణంగా వచ్చిన పరుగు లెక్కలోకి రాదని స్పష్టం చేశాడు.
ఇందుకు రసెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, డగౌట్‌లో ఉన్న కేకేఆర్ మెంటార్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి వారికి సమీపంలో ఉన్న ఫోర్త్ అంపైర్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో గంభీర్ ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫోర్త్ అంపైర్‌తో వాదించాడు.
— Nihari Korma (@NihariVsKorma) April 27, 2024
అంపైర్‌తో గంభీర్ వాదన
అయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో గౌతీ ముఖం మాడ్చుకుని అసంతృప్తిగా పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. కేకేఆర్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జానీ బెయిర్ స్టో అజేయ విధ్వంసకర శతకం(48 బంతుల్లో 108)తో పంజాబ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
చదవండి: KKR vs PBKS: టీ20లలో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఇదే తొలిసారి
.@PunjabKingsIPL are roaring again 🦁
A special victory at the Eden Gardens for #PBKS who secure the highest successful run chase in the IPL and T20s ❤️
Scorecard ▶️ https://t.co/T9DxmbgIWu#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/FNxVD8ZeW6— IndianPremierLeague (@IPL) April 26, 2024
Comments
Please login to add a commentAdd a comment