ధోని రిటైర్మెంట్‌పై కోచ్‌ క్లారిటీ! | Ravi Shastri Dismissed All Speculation On Dhoni Retirement | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 19 2018 9:51 AM | Last Updated on Thu, Jul 19 2018 11:09 AM

Ravi Shastri Dismissed All Speculation On Dhoni Retirement - Sakshi

లీడ్స్‌: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అప్పట్లో సినిమా అభిమానులను వేధించిన ప్రశ్న.. ధోని అంపైర్ల నుంచి బంతి ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు క్రీడా అభిమానులను గురి చేస్తున్న గందరగోళం. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమి చెందడంతో టీమిండియా వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌ ముగియగానే ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని.. అంపైర్లను అడిగి మరి బంతి తీసుకున్నాడు.

దీంతో ఈ జార్ఖండ్‌ డైనమెట్‌ క్రికెట్‌కు పూర్తి స్థాయిలో వీడ్కోలు పలికినట్లు తీవ్రస్థాయిలో ఊహాగానాలకు తెరలేచాయి. ప్రస్తుతం ఈ సీనియర్‌ ఆటగాడి ఫామ్‌ కలవరపెట్టడం.. 2014లో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించే సందర్భంలోనూ అంపైర్ల నుంచి వికెట్‌ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్‌కు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ అవుతున్న టాపిక్‌ ఈ విన్నింగ్‌ కెప్టెన్‌ రిటైర్మెంట్‌ గురించే కావడం గమనార్హం.

రవిశాస్త్రి క్లారిటీ..
ధోని రిటైర్మెంట్‌ ఊహాగానాలకు భారత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి చెక్‌ పెట్టాడు. బుధవారం ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్‌ వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధోని ఎటూ వెళ్లటం లేదు.. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. బంతిని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు. మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి ఒక జనరల్‌ ఐడియా కోసం తీసకున్నాడే తప్పా ఏ రిటైర్మెం‍ట్‌ ఉద్దేశం లేదు’ అంటూ రవిశాస్త్రి ‘ధోని-బంతి’ మిస్టరీపై వివరణ ఇచ్చారు.    

చదవండి: ధోని రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement