దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు. కోహ్లి సారథిగా 68 టెస్ట్‌ల్లో టీమిండియా 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే కోహ్లి ఇంకా కొన్ని సంవత్సరాలు కెప్టెన్‌గా కొనసాగింటే బాగుండేదని భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి తీసుకున్న ఈ నిర్ణయం తనను షాక్‌కు గురి చేసింది అని భరత్ అరుణ్ తెలిపాడు. కోహ్లి జట్టును నడిపించడానికి ఎంతో ఇష్టంగా ఉండేవాడని అతడు పేర్కొన్నాడు.
విరాట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోన్నాడు అన్న వార్త విని నేను ఆశ్చర్యపోయాను. మాతో మాట్లాడే ప్రతిసారీ జట్టును లీడ్ చేయడంపై కోహ్లి చాలా మక్కువ చూపేవాడు. టీమిండియాను ప్రపంచంలో నెం1 జట్టుగా నిలపాలని అతడు నిరంతరం కష్టపడేవాడు. భారత జట్టుకు అద్భుతమైన పునాదిని వేసి తన బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. విరాట్ భారత జట్టు టెస్ట్ కెప్టెన్‌గా మరో రెండేళ్లు కొనసాగింటే బాగుండేది. కెప్టెన్ అంఏ ఎంస్ ధోనిలా కూల్‌గా ఉండాలి. ప్రశాంతంగా ఉన్నప్పడే ఫీల్డ్‌లో అధ్బుతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు.
చదవండి: బంతిని చూడకుండానే భారీ సిక్సర్... అంత కాన్ఫిడెన్స్ ఏంటి రషీద్ భయ్యా!
Comments
Please login to add a commentAdd a comment