( ఫైల్ ఫోటో )
దాదాపు నాలుగేళ్ల తరువాత వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతగా రాణించలేదు. దక్షిణాఫ్రికాతో రెండు వన్డేలు ఆడిన అశ్విన్ కేవలం ఒకే ఒకే వికెట్ పడగొట్టాడు. ఇది ఇలా ఉంటే.. స్వదేశంలో వెస్టిండీస్‌తో త్వరలో జరగనున్న వన్డే, టీ20 ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ఎంపిక చేసింది. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్లలో అనూహ్యంగా అశ్విన్‌కి చోటు దక్కలేదు. అయితే అశ్విన్‌పై వేటు పడడానికి గల కారణాన్ని బీసీసీఐ చెప్పలేదు.
అయితే ప్రకారం.. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడిని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అశ్విన్ మణికట్టు, చీలమండకు తీవ్ర గాయాలయ్యాయని నివేదిక తెలుపుతుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్- భారత్ తొలి వన్డే జరగనుంది. అదే విధంగా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అవేశ్ ఖాన్, ఆల్‌రౌండర్ దీపక్ హుడా భారత జట్టు తరఫున ఆరంగట్రేం చేయనున్నాడు.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా.
టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment