ఇంగ్లండ్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఆరు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. రెండో వన్డేలో రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. కాగా ఈ సిరీస్‌లో భాగంగా మూడో వన్డే ఆదివారం జరగనుంది. ఇక ఈ సిరీస్ అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు కోహ్లితో పాటు బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు మరింత విశ్రాంతి ఇవ్వాలని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.
"బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాగా ఏ జట్టుకైనా ప్రధాన బలం ఫాస్ట్ బౌలర్లే. కాబట్టి వారి పట్ల తగినంత జాగ్రత్త వహించాల్సిన బాధ‍్యత ఆయా జట్టుల మేనేజేమెంట్‌పై ఉంటుంది. బ్యాటర్లు, స్సిన్నర్లు కంటే పేసర్లపై పని భారం ఎక్కువగా ఉంటుంది. టెస్టు క్రికెట్, టీ20 ప్రపంచకప్ వంటి టోర్నమెంట్‌లలో బుమ్రా అత్యుత్తమంగా రాణించాలంటే అతడికి విశ్రాంతి అవసరం. అదే విధంగా జట్టు వైద్య సిబ్బంది కూడా అతడి ఫిటినెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు.
చదవండి: IND Vs WI T20 Series: విండీస్‌తో టి20 సిరీస్.. కోహ్లి, బుమ్రా ఔట్
Comments
Please login to add a commentAdd a comment